అన్నా హజారే అరెస్టుతో మంగళవారం భగ్గుమన్న భారతావని ఈరోజు కూడా నిరసనలకు దిగింది . దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన్నాయి. బుధవారం సాయంత్రం ఇండియా గేట్ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తాను దీక్ష చేయడానికి బేషరతుగా అనుమతి ఇస్తేనేగానీ జైలు నుంచి కదలనని తేల్చి చెప్పిన హజారే తన పట్టు వీడడం లేదు. హజారే ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న అన్నా హజారే, ఆయన అనుచరులను అరెస్టు చేయడాన్ని అందరు ఖండించాలి. అవినీతిపై విపక్షాలు, వివిధ సంస్థలు చేస్తున్న ఆందోళనలపై కేంద్రం దాడి చేయడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టమవుతోంది . ఇప్పటికైనా ప్రతిపక్షాల, ప్రజల విజ్ఞప్తుల మేరకు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన జన్ లోక్‌పాల్ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి