ప్రపంచంలోని అన్ని దేశాల యువత కలల దేశం అమెరికా. అన్నింటికీ అవకాశాల గడ్డ. కానీ, ఇదంతా పైపైన చక్కెరపూత మాత్రమే. అమెరికాలోనూ పేదలున్నారు. అక్కడొకరు ఇక్కడొకరు కాదు.. అక్షరాలా నాలుగున్నర కోట్ల మంది తిండికి ముఖం వాచిపోతున్నారు. 'ఇన్‌కం, పావర్టీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్: 2010' పేరిట అమెరికా సెన్సస్ బ్యూరో విడుదల చేసిన నివేదిక తేల్చిచెబుతున్న విషయమిది. దీని కన్నా 'పెద్దన్న'కు బాగా ఆందోళన కలిగించే అంశమేమిటంటే మూడేళ్లుగా పేదల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతూ ఉండటం.
అమెరికా సర్కారు లెక్కల ప్ర కారం.. నలుగురు జీవించటానికి ఏడాదికి 22,314 డాలర్ల ( సుమారు రూ.10 లక్షలు) కన్నా తక్కువ సంపాదన ఉన్నా.. లేదా ఒక వ్యక్తి ఆదా యం ఏడాదికి 11,139 డాలర్ల (దాదాపు రూ.5 లక్షలు)కు తగ్గినా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్టే. అమెరికాలో పేదల సంఖ్య పెరగడానికి రెండు ప్రధానమైన కారణాలున్నాయని నిపుణులు పే ర్కొంటున్నారు. 1 నిరుద్యోగం పెరగటం. 2 ప్రజల ఆదాయం తగ్గ టం.
అమెరికా సర్కారు లెక్కల ప్ర కారం.. నలుగురు జీవించటానికి ఏడాదికి 22,314 డాలర్ల ( సుమారు రూ.10 లక్షలు) కన్నా తక్కువ సంపాదన ఉన్నా.. లేదా ఒక వ్యక్తి ఆదా యం ఏడాదికి 11,139 డాలర్ల (దాదాపు రూ.5 లక్షలు)కు తగ్గినా దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్టే. అమెరికాలో పేదల సంఖ్య పెరగడానికి రెండు ప్రధానమైన కారణాలున్నాయని నిపుణులు పే ర్కొంటున్నారు. 1 నిరుద్యోగం పెరగటం. 2 ప్రజల ఆదాయం తగ్గ టం.
"ఈ రెండింటికీ చాలా సన్నిహిత సంబంధం ఉంటుంది. నిరుద్యోగం పెరిగితే కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. దీని వల్ల పేదరికం పెరుగుతుంది'' అని మిచిగాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికవేత్తగా పనిచేస్తున్న పాల్ ఎస్టర్‌మాన్ ఈ పరిస్థితిని వివరించారు. అమెరికాలో పెరుగుతున్న పేదరికం బాగా దెబ్బతీస్తున్నది.. భవిష్యత్తు తరాలనేనని సెన్సస్ బ్యూరో నివేదిక తేల్చి చెప్పింది. 2010 నాటికి అమెరికాలో ఉన్న మొత్తం కుర్రకారులో (18 ఏళ్ల లోపువారు) 22 శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. దాదాపుగా ప్రతి ఐదుగురు యువతీ, యువకుల్లో ఒకరు పేదలే. ఈ పరిణామంపై అక్కడి స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. దారిద్య్ర రేఖకు దిగువన ఉండేవారి సంఖ్యను లెక్కించటంలోనూ కొన్ని లోపాలున్నాయనే విమర్శలున్నాయి. లెక్కలివీ.. అమెరికాలో 2009లో పేదప్రజల సంఖ్య 4.5 కోట్లు. 2010 నాటికి వీరి సంఖ్య 4.62 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాది జనవరిలో అమెరికా అధికారులు కేలిఫోర్నియాలోని ట్రైవ్యాలీ యూనివర్శిటీపై దాడులు చేసి దానిని మూసివేయించిన విషయం తెలిసిందే. జులైలో వాషింగ్టన్ నగర శివార్లలో వున్న ఒక బూటకపు యూనివర్శిటీపై అమెరికా అధికారులు దాడి చేశారు.
* దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్యను అమెరికా 1959 నుంచి లెక్కించటం మొదలుపెట్టింది. ఇంత సంఖ్యలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు ఉండటం ఇన్నేళ్లలో ఇదే తొలిసారి.
* ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో పేదల సంఖ్య ఎక్కువగా ఉన్న వాటిని లెక్కిస్తే అమెరికా మూడో స్థానంలో ఉంటుంది.
* అమెరికాలో ఫుడ్ కూపన్లు ఉపయోగిస్తున్నవారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి 28 శాతం పెరిగింది.
* పేదల కోసం అక్కడి సర్కారు రూపొందించిన మెడిక్ఎయిడ్ ప్రోగ్రాం ద్వారా 5 కోట్ల మంది అమెరికన్లు లబ్ధి పొందుతున్నారు.
* కోటి మందికి పైగా అమెరికన్లు నిరుద్యోగ బీమా పథకం కింద లబ్ధి పొందుతున్నారు.
ఇది మన అగ్రరాజంలో పేద ల పరిస్థితి ...
( ఆంధ్రజ్యోతి ...పత్రిక సౌజన్యం తో... )
vasam bagundhi
రిప్లయితొలగించండి