15, జూన్ 2011, బుధవారం

వేసవిలో కూల్ కూల్ గా ఆహ్లాదకరంగా ఎంజయ్ ...

  మేము మరియు ఈద్దరు  స్నేహితుల  కుటుంబ సభ్యులతో  ఈ మధ్య (మే చివర )   వేసవి సెలవులలో  కూల్ కూల్ గా  ఆహ్లాదకరంగా  ఎంజయ్ ... చేశాం. ఊటి , కొచిన్ , అలాప్పి, తిరువనంతపురం, కన్యాకుమారి , మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ( మదురై ), రామేశ్వరము, కొడైకెనాల్, చెన్నై, కాంచీపురం లో పర్యటించాం. చెన్నై, కాంచీపురం ఎండల్లోనే పర్యటన కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ  మిగిత ప్రాంతాలు కూల్ కూల్ గా  ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు,  బీచ్చిలు  ఆహ్లాదకరంగా అనిపించింది.  పిల్లలకైనా, పెద్దలకైనా పర్యటనలు అనేవి వినోదం, ఆనందం కలిగించడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. మేము 9 రోజులలొ  14 ప్రదేశాలను దాదాపు 4300 కీ.మీ. తిరిగినాము.  ఖర్చు  కుడా ఒకొకరికి  రూ.4000 ఐంది.  తక్కువ సమయంలో  తక్కువ ఖర్చుతొ ఎక్కువ చూశాం.          
విశేషాలేంటో చూద్దాము. 
1.ఊటీ : తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది . ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉంది.  దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి చుస్తె ఏవరైన ముగ్ధులై పోతారు.  ఈక్కడ నీరు త్రాగటానికి  వేడి చేస్తారు. అంత కూల్ గా వుంది.  చూడవలసిన ప్రదేశాలు  :  బొటానికల్ గార్డెన్స్ ( అద్భుత సౌదర్యం ),  బోట్‌హౌస్,  కాఫీ తోటలు
2. కోయంబత్తూరు :  తమిళనాడు రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం. కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్ గా పేరుగాంచినది.  కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
కేరళ సరిహద్దులలో  మేము  ప్రవేసించగనే వర్షలు ప్రారంభం. రైలులొనే చల్లచల్లగా  జల్లులు.  
  


  ౩. కొచ్చిన్  :   ఓడరేవు , బీచ్చి , బోట్‌హౌస్.  : సాయంకాలం బోట్‌ లో చల్లచల్లగా ప్రయానం  చేశాం.     

4. ఏర్నకులం  పట్టణం లో  కూల్ కూల్ గా   సాయంకాలం  వర్షం.    
5 .అల్లాప్పి : బ్యక్ వాటర్ లో  బోట్‌ లో 4 గంటలు  ప్రయానం  చేశాం. చాల  ఆహ్లాదకరమైన వాతావరణాన్ని , అనుభుతిని చూశాం.   వాటర్ లో   బోట్‌ స్టాపులు , గ్రామాలు  వసుతునే వుంటాయి. ఎటూ చూసిన వాటర్.               
6.
అల్లాప్పి బీచ్చి : పిల్లలు  మరి ఎక్కువ  ఎంజయ్ చేశారు .  స్నానాలు చేశాం , ఎంజయ్ చేశాం 
7. తిరువనంతపురం :  కేరళ రాష్ట్రానికి రాజధాని. దీనిని  ట్రివేండ్రం అని పిలిచేవారు. అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలొనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి. ప్రధానాలయం మళయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో 'పుష్కరిణి' చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. 
8 .  కోవలం బీచ్చి : తిరువనంతపురం నుండి  10 కే. మీ.  దూరం .  పిల్లలు  మరి ఎక్కువ  ఎంజయ్ చేశారు .  స్నానాలు చేశాం , ఎంజయ్ చేశాం. 
9. కన్యాకుమారి :  తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము.
 ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశము.  ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఇది పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం. వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి సూర్యోదయం,  తిరువళ్ళువార్ విగ్రహం, 133 అడుగుల ఎత్తు, కన్యాకుమారి. ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి. తిరువళ్ళువార్  తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త మరియు నీతిజ్ఞుడు. ఇతని రచన తిరుక్కురళ్, తమిళ సాహిత్యానికి మకుటం లాంటిది. నీతి బోధలు గల ఇతని కవిత్వం తమిళ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. త్రివేని సంగంలొ తీర్థయాత్రికులు స్నానాలు చేస్తున్నారు. ఈ ప్రదేశంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి.  సముద్రం నీరు మూడు రంగులలొ కనిపిస్తుంది 
10.మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ( మదురై ): దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం  ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది  తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు - రూపంలో శివ దేవుడికి- మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మదురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు నిలయంగా ఉంది, ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది, 

11.రామేశ్వరము :  తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది. ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది.  ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన రామసేతువు. రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము. రామేశ్వరము సముద్రమట్టానికి 10 మీటర్ల్ ఎత్తు లొ ఉన్న ఒక ద్పీపము.  వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన ,బస్ లు ఇతర వాహనాల కోసం వేరే వంతెన వున్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలొమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి. రైలు వంతెన షిప్ లు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్ లొ కుర్చుని సుర్యొదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతంగ ఉంటుంది.

12. కొడైకెనాల్ : దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న వేసవి విడుదులు రెండు అయితే వాటిలో ఒకటి ఊటీ కాగా, రెండవది కొడైకెనాల్. 


తూర్పు కనుమలు యొక్క కొండల వరుసలలో ఉన్న అందమైన ఒక హిల్ స్టేషన్. కొడై కెనాల్ తమిళనాడు రాష్ట్రానికి దాదాపు నడిబొడ్డుకు దగ్గరగా ఉంది. కొండ ప్రాంతం కనుక ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే మధురై నుండి సుమారు నాలుగు గంటలు.  రోడ్డులో ప్రయాణిస్తే లైట్లు వేసుకొవలి. అంత మంచుతో వుంటుంది. ప్రక్కన వున్నవారు కుడా కనబడారు.  పార్కు లొ  ఐతే మేగాలు  మనకు తగులుతూ పొతాయి .  అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి చుస్తె ఏవరైన ముగ్ధులై పోతారు.  మద్యలొ వాటర్ పల్స్. ఈక్కడ నీరు త్రాగటానికి  వేడి చేస్తారు. అంత కూల్ గా వుంది.    
   
13. చెన్నై  : భారత దేశములోని తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరము బంగాళా ఖాతము యొక్క తీరమున ఉన్నది. చెన్నై పూర్వపు పేరు మద్రాసు. ఈ నగరము బంగాళా ఖాతం తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు.  

14. కాంచీపురం :   కాంచీపురం జిల్లా.  చెన్నై నగరానికి 70 కి.మీ దూరంలో ఉన్నది.  కంచి పట్టణం నందు పంచభూత క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వర దేవాలయం, కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్యుడు స్థాపించిన మూలామ్నాయ కంచి శంకర మఠం ఉన్నాయి.  పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న కంచి కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. కంచి పట్టుచీరలు దక్షిణ భారతదేశం నందే కాక ఉత్తర భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. 
                
    మొత్తం మీద  మేము ( మా కుటుంబ సభ్యులు, స్నేహితుల కుటుంబ సభ్యులు ) ఈ   వేసవి సెలవులలో  కూల్ కూల్ గా  ఆహ్లాదకరంగా  ఎంజయ్ ... చేశాం.  మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ( మదురై ),  చెన్నై, కాంచీపురం పర్యటనకు కొంత సమయం సరిపొక  కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ  మిగిత ప్రాంతాలు కూల్ కూల్ గా ఎంజయ్ పర్యటించాం.  మీరు   చూడకపొతే   ప్రయత్నం చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి