14, జూన్ 2011, మంగళవారం

యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే  రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి   నేటికీ ఆదర్శం   
ప్రపంచంలో ఎకడచుసినా  నీ రూపం...

ఏ   కీ చైన్  చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...  

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

             చే గెవారా   దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు.  రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ  వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
              అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో
చే జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు.  విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు
          
1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు. చే గెవారా  అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా.  గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు.
                ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు  చే  పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే  క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.

              ప్రపంచంలో ఎక్కడ  అన్యాయం జరిగినా 
                          ఎదురించడానికి  సిద్దంగా ఉండు - చే  
 
(నేడు చేగువేరా  జయంతి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి