హైదరాబాదులో భారీ వర్షం కురిసితే పరిస్తితి ఇంతేనా.... ఇంకా బాగుపడదా... ఇంకా ఎంతా కాలం... ప్రజలు నరకం అనుభవించల్సిదేనా... విముక్తి లేదా...
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాదులోని రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలొమీటర్ల కొద్ది వాహనాలు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది. బస్టాప్ ప్రాంతంలో రోడ్డు పై నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాలలో నీరు ఎక్కవ మొత్తంలో రోడ్లపై నిలవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వర్షపు నీటిలో మునిగి ముందుకు సాగకుండా మెరాయించాయి. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కొన్ని రోడ్ల పై గంటల సేపు నీరు ఎక్కువ మొత్తంలో నిలిచింది. దానితో రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. అనేక ప్రాంతాలలో భారీ వర్షానికి పలు ఇళ్ళల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రంలోని తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి