31, మార్చి 2020, మంగళవారం

ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న క్యూబా...

అమెరికా, ఇటలీ, బ్రిటన్, జర్మనీ... అవకాశం వచ్చినప్పుడల్లా 
క్యూబాపై ఆంక్షలు విధిస్తూ హంగామా చేస్తుంటాయి. 

ఇప్పుడు మీ డాక్టర్లను మా దేశానికి పంపండి 
మహాప్రభో అంటూ క్యూబాను  వేడుకున్నాయి.  
క్యూబా కూడా పాత విద్వేషాలు పట్టించుకోకుండా 
మానవసేవ_మాధవసేవ అంటూ 
తన దేశం లో తయారైన  మందులను, డాక్టర్స్ ని
చైనా, ఇటలీ, స్పేయిన్, వెనెజులా, ఆఫ్రికా,.. 37 దేశాలకు పంపించింది.

29, మార్చి 2020, ఆదివారం

నిజం గడప దాటకముందే...

మీత్రులందరికి శుభోదయం...
మిత్రులందరు సామాజిక మాధ్యమాల్లో చిన్నచిన్న జాగ్రత్తలు పాటించగలరు...

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నది.
ప్రపంచంలో ఇప్పటికి 6 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
దాదాపు 30 వేల మంది చనిపోయారు. 
మరోప్రక్క నకిలీ, తప్పుుడు వార్తలు కుప్పలుగా ప్రచారంతో
ప్రజలను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి...
ప్రముఖ ఆస్పత్రి వైద్యుడు చెప్పినవి..., 
మరియు జెడీ లక్ష్మీనారాయణ పేరుతో... 
గ్రూప్‌లలో కూడా వచ్చాయి. 
ఆవి నకిలీ అని ఈ రోజు పేపర్‌ వచ్చింది.

మనం పంపుతున్న సమాచారం నిజమా, కాదా,
కచ్చితమైన సమాచారం అని నిర్ధారించుకోవాలి. 
సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి.
తర్వాతే ఇతరులకు పంపించడం చేయలి. 
దానితో తపుడు సమాచార ప్రవాహానికి ఆడ్డుకట్ట వేయవచ్చు.


'' నిజం గడప దాటకముందే,
అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు'' ఒక సామేత.
ఇపుడు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుప్ప్రచారాలను నమ్మొద్దు.
ప్రభుత్వాలు, ప్రఖ్యాత సంస్థలు, విశ్వసనీయ పత్రికల వార్తలనే నమ్మండి...
...... వీరయ్య 29.03.2020





28, మార్చి 2020, శనివారం

సరిలేరూ... నీకెవ్వరూ...

లాభాపేక్ష పై ఆధారపడిన  అమెరికా, బ్రిటన్‌, ఇటలీ, స్పేయిన్,... పెట్టుబడిదారీ వ్యవస్థలు... 
మానవత్వం మూర్తీభవించిన సోషలిస్టు వ్యవస్థల ముందు దిగదుడుపే..!

మన తెలంగాణ రాష్ట్రం అంత జనాభా కుడా లేని చాల చిన్న దేశం క్యుబా.  
చెగువెరా,క్యాస్ట్రొ ల వారసత్వం తో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం లో 
ఆరోగ్య రంగాన్ని ప్రభుత్వం చేతిలో ఉంచుకుని ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నది.
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నుండి ప్రజలను క్యుబా రక్షిస్తుంది.
తన దేశం లో తయారైన డాక్టర్స్ ని, మందులను  కరోనా బాధితులను ఆదుకునేందుకు  చైనా,ఇటలీ, స్పేయిన్,  వెనెజులా, ఆఫ్రికా... దేశాలకు పంపించింది.




25, మార్చి 2020, బుధవారం

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు, 
దాని వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ
కరోనా మీద విజయం సాధించి 
నవయుగానికి బాటలు వేయటంలో 
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని  కోరుతూ
షడ్రుచుల ఉగాదితో  ఇంటింటా ఆయురారోగ్యాలు, 
సిరిసంపదలు, ఆనందాలు నిండాలని...   
మీకు,
మీ కుటుంబ సభ్యులకు..
శ్రీ శార్వరి నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు...


24, మార్చి 2020, మంగళవారం

అర్ధరాత్రి నుంచి 21 రోజులు దేశమంతా లాక్‌డౌన్‌...

కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధ రాత్రి 12 నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ 21 రోజులు కొనసాగుతుందని మోదీ తెలిపారు. ఈ సమయంలో ఇంటి నుంచి బయటకు రావడాన్ని పూర్తిగా నిషేధించారు.
దేశానికి ఇది పరీక్షా సమయమని, నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సంక్లిష్ట సమయంలో అందరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించడమే ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పరిష్కారమని అన్నారు.

స్వీయ నిర్బంధం తప్ప మరో మార్గం లేదన్నారు. సమిష్టిగా ఈ వైరస్‌పై పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఇళ్లలో ఉంటేనే కరోనా నుంచి బయటపడగలమని అన్నారు. మహమ్మారి వైరస్‌ సైకిల్‌ను మనం అడ్డుకోవాలని అన్నారు. ప్రపంచ పరిణామాలను మనం పరిశీలిస్తున్నామని, అగ్రరాజ్యాలను సైతం ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోందని గుర్తుచేశారు. కరోనా సంక్రమించిందన్న విషయం ముందు ఎవరూ గుర్తించలేరన్నారు. వ్యాధి లక్షణాలున్న వారే కాకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని అన్నారు. తాను ప్రధానిగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిలా చెబుతున్నానని, ఈ మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒక వ్యక్తి నుంచి వేల మందికి వైరస్‌ వ్యాపించవచ్చని అన్నారు.
11 రోజుల్లోనే లక్ష నుంచి రెండు లక్షల మందికి సోకిందని డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాలు వెల్లడించాయని చెప్పారు.

కరోనా కరోనా ...ఎందుకు నిర్లక్ష్యం...

ఎంత మర్యాదగా , జాగ్రత్తగా చెప్పినా వినడంలేదు....
ఇప్పుడు చెబుతాను వినండి.... నువ్వు పీల్చేది మాములు గాలి కాదు...

నువ్వు పట్టుకున్నవన్ని శుద్దమైన వస్తువులు కాదు...
నీ చుట్టు ఉన్నవారంతా ఆరోగ్యవంతులు కాదు..
నీ కంటికి కనబడేదంతా # నిజం కాదు...
ఇప్పటివరుకు కరోనా వచ్చినవాళ్లంతా, వారి పక్కింటివారు, వీదిలోని వారు, ఏరియా వాళ్లు మీలానే ఆలోచించారు.... కరోనా నాకు దగ్గరగా లేదుగా అని....
మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి నీ చుట్టూ #కరోనావైరస్ ఉంది...
ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం ,నీ బంధువులు, నీ స్నేహితులు
తగిన #మూల్యం చెల్లించుకోవాల్సిందే...



మనకంటే ఎంతో ఎంతెంతో డెవలప్‌ అయిన దేశాల్లో # మరణమృదంగం మోగుతోంది....  సామాన్యుల నుండి అద్యక్షులు వరకు, అపరకోటీశ్వరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ
# కరోనా బారిన పడ్డారు....
కరోనా వస్తే ఏమౌతుంది... జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా... #సీజనల్ వ్యాదిలాగా నాలుగురోజులు ఉండి పోతుంది అనుకోకండి....
దగ్గు దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్.... ఊపిరి తీసుకోవడం కష్టం... 
ఆ దగ్గు వల్ల #లంగ్స్ దెబ్బతింటాయి.. # లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది...  గుండె ఆగిపోతుంది... 
బ్రతకాలి అనే #కోరిక తప్ప ఎవరూ ఏం చేయలేరు... దగ్గు, జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలినవాళ్లు తప్ప ఎవరూ బ్రతకరు...( #ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి బ్రతికేఛాన్సెస్ ఎక్కువ ) 



నువ్వు హాస్పటల్ లో ఉంటే నీ కన్న తల్లి/తండ్రి..,  కొడుకు/ కూతురు.., భార్య/భర్త..,  ఎవరిని కలవ లేవు... కలిస్తే వారు #ప్రమాదంలో పడతారు....
పదే పదే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఎందుకు # పుట్టానురా అనుకుంటావ్....
ఈ దగ్గు, జలుబు భరించేకన్నా #పోతే_బాగుండు అనిపిస్తుంది.. కాని పోలేవ్... 
కాపాడండి డాక్టర్ అని # అరిచిగీపెట్టినా దైర్యం చెప్పడం తప్ప ఏం చేయలేరు...
మనం పోతే కనీసం #బాడీని కూడా ఇంటికి పంపరు... కనీసం మిగిలిన బూడిద కూడా ఇవ్వరు....
# కుక్కచావు అంటాం కదా దాని కంటే దారుణంగా ఉంటుంది చావు ..
......................



అవసరమా.... మనకి అవసరమా...??? ఎందుకు #నిర్లక్ష్యం, ఎందుకు #దీమా....
ప్రాణం అంటే ఎవరికి #తీపి ఉండదు... అనవసరంగా మన, మనవాళ్ల #ప్రాణాలు తీసుకుందామా...??
పొరపాటున బయటివస్తే మొహానికి ఖర్చీఫ్ , బయటవారికి దూరం, వ్యక్తిగత శుభ్రత..... 
ఇంతే కేవలం ఇంతే..80% కరోనా నీ దరికి చేరకుండా ఉంటుంది... అత్యవసరం అయితేనే బయటకి రండి...
మనం బ్రతికి ఉంటేనేగా మన ఇంట్లోవాళ్లు సుఖంగా ఉండగలరు... 
Note:


పోతే పోయింది ఓ నెల..... మహా అయితే కోలుకోవడానికి, కష్టాన్ని, నష్టాన్ని పూడ్చుకోవడానికి నెలో, ఏడాదో పడుతుంది..

భరిద్దాం... # జీవితాన్ని కోల్పోవడం కన్నా జీవితంలో నెల # కోల్పోవడం బెటరే కదా....
ఆలోచించండి .. అవసరమైతే తప్ప బయటకి రాకండి.... ప్లీజ్.....
మీ అందరి క్షేమం కొరుకునే మిత్రున్ని, బందువున్ని, శ్రేయోభిలాషిని.. ఒక్కడు బయటికి పోతుండుగా నాకైమైతది అన్న ఆలోచన మాత్రం చేయకండి...

బయటి దేశాలలో ఇంత కన్న ఘాటుగా ఉన్నాయట చర్యలు ...
 


23, మార్చి 2020, సోమవారం

తెలంగాణ లాక్ డౌన్...

LOCK OUT  అనేది చాలా అరుదుగా తీసుకునే చర్య.
ప్రభుత్వం అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుంది అంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవాలి.
లాక్ డౌన్ లు ప్రస్తుతానికి వైరస్ ప్రబలె రేటు ని తగ్గిస్తాయి.
ద్వార తగిన సమయం , వనరుల సమన్వయం చేసుకొనే అవకాసం లభిస్తాయి.
కాని దీని ద్వారా పూర్తి నివారణ జరగదు.దీనికి పేషెంట్స్ ని పట్టుకొని వేరు చేసి 
వారిని వేరే వారికీ వైరస్ పాస్ చెయ్యకుండా చూడాలి. భారతదేశం లో ఇది చాల ఇబ్బందికరమైన పనే.
కాని తప్పదు.లేకపోతే లాక్ డౌన్ తరువాత విజ్రున్బించే అవకాసం ఉంది.
టెస్ట్ కిట్స్ ఎక్కువగా పెంచాలి. ఇసోలేషన్ వార్డ్స్ పెంచాలి. ప్రైవేటు హాస్పిటల్స్ టెస్టింగ్ ని ఫ్రీ చెయ్యాలి.
ప్రైవేటు హాస్పిటల్స్ ని ఒక నెల వరకు ప్రభుత్వ అధినం లో తీసుకోవాలి.
అసత్య ప్రచారం మానుకోండి. మానవ విజ్ఞానం తప్ప ఇంకో దారి లేదు.






పేరు వినిపిస్తేనే హృదయాలు ఉత్తేజితమవుతాయి....

భగత్‌సింగ్‌ పేరు వినిపిస్తేనే భారతీయులందరికి హృదయాలు ఉత్తేజితమవుతాయి.
భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే భారతదేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. 
భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు.
'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి
సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి. 

దోపిడి, అన్యాయాలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం పోరాడిన భగత్ సింగ్ కి విప్లవ జోహార్లు.
వారి స్ఫూర్తితో భారతదేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, మానవత్వం, మత సామరస్యం కోసం 
పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో  పెంపొందించాలి.

21, మార్చి 2020, శనివారం

జనతా కర్ఫ్యూ పాల్గొందాం...

22.03.2020 ఆదివారం -ఉదయం 7.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు 
స్వయంగా ఎవరికి వారే ఇంటికి  పరిమితం కావాలని ,
 జనతా కర్ఫ్యూ కు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి (దేశ ప్రధానమంత్రి గారు)

తెలంగాణ లో 22.03.2020 ఆదివారం-ఉదయం 6.00 గంటల నుండి
 సోమవారం ఉదయం 6.00 గంటల వరకు జనతా కర్ఫ్యూ కు
 ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి (మన ముఖ్యమంత్రిగారు
      ప్రజలందర్ని గజగజలాడిస్తున్న ‘కరోన’ వైరస్ బారినపడిన వ్యాదిగ్రస్తులకు సేవలందిస్తున్న
 వైద్యులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు.

సంఘీభావం తెలుపుతూ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఐదువిమిషాలు 
చప్పిట్లతో అభినందనలు తెలియజేయాలి.

20, మార్చి 2020, శుక్రవారం

కరోనాపై ఇంటింటి కాంపెయిన్‌ ...

నేడు పాత నల్లకుంట ఎరియాలో హైదరబాద్‌ జిందాబాద్‌ మరియు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కాంపెయిన్‌ను జిహెచ్‌ఎంసి ఎఎంహెచ్‌వో డా.హేమలత గారు ప్రారంభించారు. ముందు జాగ్రత్తలు పాటించి, కరోనా వైరస్‌ వాప్తిని అరికట్టాలని పాత నల్లకుంట లో కరోనాపై అవగాహన కరపత్రాలు ఇంటింటికి పంచుతు కాంపెయిన్‌ చేయడం జరిగింది..
కార్యక్రమంలో సినియర్‌ సిటిజన్స్‌ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్‌ రావు గారు, డా|| జయాసూర్య గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు వీరయ్య, శ్రీనివాస్‌ స్థానిక నాయకులు మోహన్‌, రమణ, సోమేష్, వివి సుబ్రమణ్యం,మధు తదితరులు పాల్గొన్నారు.

 

19, మార్చి 2020, గురువారం

కరోనా నియంత్రణకు భారత్‌లో కఠిన నిర్ణయాలు...

 కరోనా వైరస్‌ నియంత్రణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 
కరోనా మూడో దశకు వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 
గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది.
 మార్చి 22 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
 65 ఏళ్లకు పైబడినవారు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది. 
పౌరవిమానయాన, రైల్వేల్లో పాసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
వారం పాటు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నట్టు పేర్కొంది. 
అత్యవసర సర్వీసులు మినహా అందరూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని కోరింది. 

కరోనా మహమ్మరి ఈరోజు భారత్‌లో మరోకరిని బలితీసుకుంది.
పంజాబ్‌లో కరోనా వైరస్‌ సోకిన 72 ఏళ్ల వృద్దుడు గురువారం మృతిచెందాడు.
దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. 
ఇటీవలే అతను జర్మనీ నుంచి ఇటలీ మీదుగా భారత్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. 
ఇప్పటివరకు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా మరణాలు నమోదయ్యాయి. 
తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 169కు చేరింది. 


15, మార్చి 2020, ఆదివారం

కరోనా కట్టడికి..విద్యాసంస్థలు, సినిమా హాళ్లు బంద్‌

- 31వరకూ మూసేయాలి 
- పరీక్షలు యధాతథం
- ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తే అనుమతుల రద్దు :విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ 
- సీఎస్‌ ఆధ్వర్యాన రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి
- 1,020 ఐసోలేషన్‌ పడకలు 
- 321 ఐసీయూల ఏర్పాటు 
- వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్లనే ప్రచురించాలి 
- లేదంటే మీడియాపైనా కఠిన చర్యలు
- అసెంబ్లీ సమావేశాల కుదింపుపై నేడు నిర్ణయం?

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఈనెల 31 వరకూ మూసేయాలని నిర్ణయించింది. సినిమా హాళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లు, స్టేడియాలు, జిమ్ములు, జూపార్కులు, మ్యూజియాలు, స్విమ్మింగ్‌పూల్స్‌ను కూడా బంద్‌ చేయాలని ఆదేశించింది. మార్చి 31 తర్వాత ఫంక్షన్‌ హాళ్లు కూడా మూసేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సమ్మర్‌ కోచింగులు, ప్రత్యేక క్లాసుల పేరుతో తరగతులు నిర్వహిస్తే ఆయా విద్యాసంస్థల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి పది,ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఎంబీబీఎస్‌, నర్సింగ్‌, డెంటల్‌ విద్యార్థులకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందనీ, అయితే ఆయా కోర్సుల్లోని చివరి సంవత్సరం, పీజీ విద్యార్థులకు యధావిధిగా తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. బహిరంగ సభలు,సమావేశాలు,సెమినార్లు, ఉత్సవాలు, ర్యాలీలను నిషేధించినట్టు చెప్పారు. జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో వైరస్‌ సంక్రమించే అవకాశం ఉన్నందున పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. 




కోమాలో జీహెచ్‌ఎంసీ : హైకోర్టు

కాలుష్యం కోరలు చాచింది. జీహెచ్‌ఎంసీ మాత్రం నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే ఎనిమిది ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది. కేసులు పడ్డప్పుడు మూడు పరిశ్రమల నుంచే కాలుష్యం వెలువడుతోందని జీహెచ్‌ఎంసీ చెప్పింది. అనుమానం వచ్చి హైకోర్టు కమిటీ వేసి రిపోర్టు తెప్పించుకుంటే 345 పరిశ్రమల నుంచి కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని తేలింది. దీంతో జీహెచ్‌ఎంసీ కండ్లు తెరిచి 3 కాదు 198 పరిశ్రమల నుంచి కాలుష్య సమస్య ఉందని మరో అఫిడవిట్‌ వేసింది. 2012 నాటి పిల్స్‌పై అప్పుడే జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, కాలుష్య నియంత్రణ మండలి కలిసికట్టుగా పనిచేసుంటే 198 నుంచి 345కు పెరిగేవి కాదు. కాలుష్యం వల్ల జనం అల్లాడిపోతున్నారు. అయినా అధికారులకు పట్టడం లేదు.2016లో పొల్యూషన్‌ వల్ల సమస్యలున్న పరిశ్రమలపై చర్యలకు వీలుగా రాష్ట్ర సర్కార్‌ జీవో ఇస్తే దానిని అమలు చేయలేదని జీహెచ్‌ఎంసీ చెప్పడాన్ని ఎలా పరిగణించాలి ? అని ప్రశ్నించింది. ఆలస్యం చేసినందుకు క్షమాపణలు చెప్పారు. 2012 నాటి కేసులో ఉన్న కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిద్రపోతున్నారా లేక కోమాలా ఉన్నారా అని ప్రశ్నించింది. 
తిరుమలరావు సిఫారసులను అమలుచేస్తున్నారా ?
ఫీజుల్ని నియంత్రణ చేసేందుకు ఓయూ మాజీ వీసీ తిరుమలరావు కమిటీ ఇచ్చిన రిపోర్టును అమలు చేస్తున్నారో లేదో చెప్పాలని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఆదేశించింది.