15, మార్చి 2020, ఆదివారం

కరోనా కట్టడికి..విద్యాసంస్థలు, సినిమా హాళ్లు బంద్‌

- 31వరకూ మూసేయాలి 
- పరీక్షలు యధాతథం
- ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తే అనుమతుల రద్దు :విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ 
- సీఎస్‌ ఆధ్వర్యాన రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి
- 1,020 ఐసోలేషన్‌ పడకలు 
- 321 ఐసీయూల ఏర్పాటు 
- వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్లనే ప్రచురించాలి 
- లేదంటే మీడియాపైనా కఠిన చర్యలు
- అసెంబ్లీ సమావేశాల కుదింపుపై నేడు నిర్ణయం?

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఈనెల 31 వరకూ మూసేయాలని నిర్ణయించింది. సినిమా హాళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్లు, స్టేడియాలు, జిమ్ములు, జూపార్కులు, మ్యూజియాలు, స్విమ్మింగ్‌పూల్స్‌ను కూడా బంద్‌ చేయాలని ఆదేశించింది. మార్చి 31 తర్వాత ఫంక్షన్‌ హాళ్లు కూడా మూసేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సమ్మర్‌ కోచింగులు, ప్రత్యేక క్లాసుల పేరుతో తరగతులు నిర్వహిస్తే ఆయా విద్యాసంస్థల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి పది,ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఎంబీబీఎస్‌, నర్సింగ్‌, డెంటల్‌ విద్యార్థులకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందనీ, అయితే ఆయా కోర్సుల్లోని చివరి సంవత్సరం, పీజీ విద్యార్థులకు యధావిధిగా తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. బహిరంగ సభలు,సమావేశాలు,సెమినార్లు, ఉత్సవాలు, ర్యాలీలను నిషేధించినట్టు చెప్పారు. జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో వైరస్‌ సంక్రమించే అవకాశం ఉన్నందున పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి