15, మార్చి 2020, ఆదివారం

కోమాలో జీహెచ్‌ఎంసీ : హైకోర్టు

కాలుష్యం కోరలు చాచింది. జీహెచ్‌ఎంసీ మాత్రం నిద్రపోతోంది. నిద్ర కూడా కాదు. కోమాలో ఉంది. అందుకే ఎనిమిది ఏండ్ల నాటి కేసులో చర్యలు తీసుకోలేపోయింది. కేసులు పడ్డప్పుడు మూడు పరిశ్రమల నుంచే కాలుష్యం వెలువడుతోందని జీహెచ్‌ఎంసీ చెప్పింది. అనుమానం వచ్చి హైకోర్టు కమిటీ వేసి రిపోర్టు తెప్పించుకుంటే 345 పరిశ్రమల నుంచి కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని తేలింది. దీంతో జీహెచ్‌ఎంసీ కండ్లు తెరిచి 3 కాదు 198 పరిశ్రమల నుంచి కాలుష్య సమస్య ఉందని మరో అఫిడవిట్‌ వేసింది. 2012 నాటి పిల్స్‌పై అప్పుడే జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, కాలుష్య నియంత్రణ మండలి కలిసికట్టుగా పనిచేసుంటే 198 నుంచి 345కు పెరిగేవి కాదు. కాలుష్యం వల్ల జనం అల్లాడిపోతున్నారు. అయినా అధికారులకు పట్టడం లేదు.2016లో పొల్యూషన్‌ వల్ల సమస్యలున్న పరిశ్రమలపై చర్యలకు వీలుగా రాష్ట్ర సర్కార్‌ జీవో ఇస్తే దానిని అమలు చేయలేదని జీహెచ్‌ఎంసీ చెప్పడాన్ని ఎలా పరిగణించాలి ? అని ప్రశ్నించింది. ఆలస్యం చేసినందుకు క్షమాపణలు చెప్పారు. 2012 నాటి కేసులో ఉన్న కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోకుండా అధికారులు నిద్రపోతున్నారా లేక కోమాలా ఉన్నారా అని ప్రశ్నించింది. 
తిరుమలరావు సిఫారసులను అమలుచేస్తున్నారా ?
ఫీజుల్ని నియంత్రణ చేసేందుకు ఓయూ మాజీ వీసీ తిరుమలరావు కమిటీ ఇచ్చిన రిపోర్టును అమలు చేస్తున్నారో లేదో చెప్పాలని రాష్ట్ర సర్కార్‌ను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఆదేశించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి