29, సెప్టెంబర్ 2018, శనివారం

నమ్మి తీరవలసిన " నిజం "

నమ్మి తీరవలసిన " నిజం "
ఆరోజు ఎప్పటిలా నేను నా ఆఫీసు వర్క్స్ ముగించుకుని లోకల్ ట్రైన్ లో బయలు దేరాను.. నాముందు ఒక పన్నెండు సంవత్సరాల కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు..
* నేను ఏం తమ్ముడూ!! పూర్తిగా అమ్మేసావా సమోసాలు..
* అవును సార్!
* పాపం రోజంతా కష్టపడుతున్నావ్?
* అవును సార్!! ఏంచేస్తాం.. పొట్ట కోసం తప్పదు కదా!!
* ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది???
* రూపాయి వస్తుంది సార్!!
* రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??
* మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 – 3,500 అమ్ముతాను.. సరాసరి ఒక రోజుకు 2,000 ఖచ్చితంగా అమ్ముతాను సార్!!
* నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 అంటే 2,000 రూ.. నెలకు 60,000రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే.. వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా… తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని.
* లేదన్నా మా యజమాని వేరే వారి దగ్గర కొని నాకిస్తాడు.
* ఇవి కాకుండా ఏం చేస్తావు!!”
* వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా.. పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… అక్క పెళ్ళి చేసాను… ఆ పొలం విలువ ఇప్పుడు పదిహేను లక్షలుంటుంది…?????????????
* నాకు మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని తమ్ముడు!! ఏం చదువుకున్నావు..
* మూడో తరగతి…
* ఏం నీకు చదవాలని లేదా!!!
* సార్ నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు.. కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా!! ఇదే మా అయ్య నాకు నేర్పిన నీతి… కానీ నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇక నాకు చదువు అక్కరలేదు..
* అబ్బ ఎంత గొప్పనీతి సూత్రం!!!
* అన్నా నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!!
ఇప్పుడు చెప్పండి…. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు…. చదువులేని వారు అనామకులూ కాదు… మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచుకుంటే… రేపు అనేది అంతా మనదే…
నోట్: ఇదేదో సమోసాలు అమ్ముకునే వాడితోనో.. తోపుడు బండి నడిపేవాడితో పోల్చామని అనుకోవద్దు.. మనం చేసే పని లో తప్పు లేనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని క్రొత్త అవకాశాలను వెదకటంలో తప్పులేదు.. దీనినే ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటారు. (విదేశాలలో చదువుకోవడానికి వెళ్ళి పనిచేసే ఎందరో మిత్రుల కథలకు స్ఫూర్తిగా ఈ కథ).

23, సెప్టెంబర్ 2018, ఆదివారం

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం...

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం..... టెస్టులు, వైద్యం, ఉచితం..... 
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 23-09-2018 న జరిగింది. 
డా|| ఎం.ఉపేందర్‌ రెడ్డి గారు, డా|| వై.ఎం.ఎం.రాజు గారు, డా|| బి.వేణుగోపాల్‌ గారు, డా|| ఆర్‌.రవి గారు పాల్గొని ఈ వైద్య శిబిరంలో ఉచిత సేవలందించారు. వాలంటీరులు 29 మంది పాల్గొన్నారు. 

ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.00 గం||ల వరకు జరుగుతుంది. 
మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.


19, సెప్టెంబర్ 2018, బుధవారం

హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరొ ఘటన...

మిర్యాలగూడ ‍ప్రణయ్‌ హత్య ఘటన మరవక ముందే, 
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరొ ఘటన...
కులాంతర వివాహం చేసుకున్నారని నవదంపతులపై పట్టపగలే అమ్మాయి తండ్రి హత్యాయత్నం చేయడం నగరంలో కలకలం సృష్టించింది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ రోజు (19.09.2018) కొత్త బట్టలు కొనిస్తానని అమ్మాయి తండ్రి ఫోన్‌ చేసి, ఇద్దరిని హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్‌ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని జీర్ణించుకొని మాధవి తండ్రి మనోహర చారి కక్షతో వారిపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు. సందీప్‌ పరిస్థితి పరవాలేదు కానీ.. అమ్మాయి పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇక మిర్యాలగూడ ‍ప్రణయ్‌ హత్య ఘటన (14.09.2018) మరవక ముందే నగరం నడిబొడ్డున ఈ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
మనిషిని మనిషిలా చూద్దాం...
కులం, మతం కన్నా మానవత్వం గొప్పదని చాటుదాం...


18, సెప్టెంబర్ 2018, మంగళవారం

పర్యావరణాన్ని కాపాడలని '' మట్టి గణేష్‌ విగ్రహాల ఉచిత పంపిణి ''...

పర్యావరణాన్ని కాపాడలని '' మట్టి గణేష్‌ విగ్రహాల ఉచిత పంపిణి ''... హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో


17, సెప్టెంబర్ 2018, సోమవారం

కులం.. ప్రళయమై విరుచుకుపడినవేళ...

                     చూసినవాళ్లంతా ‘ఎంత ముచ్చటైన జంటో’నని అసూయపడితే.. ఆమె గర్వంగా ఫీలయింది! ‘మన మధ్య కులమే కదా అడ్డుగోడ? దాన్ని చెరిపేసి.. మీ తల్లిదండ్రులకు దగ్గరవుదాం’ అన్న భర్త మాటలకు ఎంతగానో మురిసిపోయింది. అతడితో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అతడిప్పుడు లేడు! ఏదో ఒకరోజు తాను చెరిపివేస్తానని అనుకున్న కులగీతే అతడికి మరణశాసనమైంది. ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది.
                       కులం.. ప్రళయమై విరుచుకుపడినవేళ ‘ప్రణయ’ం ఓడింది!! ప్రణయ్‌తో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్న అమృతకు అతడి జ్ఞాపకాలే మిగిలాయి.

                    ‘‘కులమే మా ప్రేమకు అడ్డుపడింది. చివరికి ఆ కులమే నా ప్రణయ్‌ని చంపేసింది. కుల నిర్మూలన జరగాలని ప్రణయ్‌ అంటుండేవాడు. అందుకోసం నేను పోరాడతా! ప్రణయ్‌ ఆశయాన్ని నెరవేర్చుతా!! నేను పుట్టింటికి వెళ్లనే వెళ్లను. డాడీ, బాబాయిలకు శిక్ష పడేవరకు పోరాడుతాను’’. -అమృత వర్షిణి





16, సెప్టెంబర్ 2018, ఆదివారం

'' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి ''...

వినాయక చవితి రోజు (13.09.2018) సుందరయ్య పార్క్‌లో హైదరాబాద్‌ జిందాబాద్‌ మరియు వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ఆధ్వర్యంలో '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమాన్ని శ్రీమతి శైలాజ మోహన్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ ప్రదాన కార్యదర్శి ఎం.ఎన్‌.రావు, మాజీ అధ్యక్షులు మూరళి కృష్ణ గారు, నాయకులు రమేష్‌, రత్నకర్‌రెడ్డి, మురళి, ఎం.ఎన్‌.యాదగిరి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, సహాయ కార్యదర్శి వి.విజరుకుమార్‌, నాగేశ్వర్‌, జెకె. శ్రీనివాస్‌, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 




12, సెప్టెంబర్ 2018, బుధవారం

"మట్టి గణేష్ ల ఉచిత పంపిణి"

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నేడు (12.09.2018) పాత నల్లకుంటలో జరిగిన '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమంలో స్థానిక నాయకులు డా|| బాలరాజ్‌ గారు, ఆర్యభట్‌ హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీ చంద్రశేఖర్‌ గారు , సీనియర్‌ అడ్వకేట్‌ బాలకృష్ణరెడ్డి గారు, రామకృష్ణరావు గారు, సీనియర్‌ నాయకులు లక్ష్మయ్యగారు,అజయ్ కుమార్ రెడ్డి,ప్రసాద్, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్‌, మోహన్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.


10, సెప్టెంబర్ 2018, సోమవారం

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...

"మట్టి గణేష్ ల ఉచిత పంపిణి" హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో
మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...

పర్యావరణాన్ని కాపాడాలని "మట్టి గణేష్ ల ఉచిత పంపిణి"

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, విష రసాయనాలతో చేసిన వినాయకులు పర్యావరణాన్ని ద్వంసం చేస్తాయాని, అందుకు మట్టి గణేష్‌ విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని, ప్రతి ఇక్కరూ ఇళ్ళలో మట్టి విగ్రహాలను పూజించాలని రిటైర్డ్‌ వ్వవసాయ సైంటిస్ట్‌ శ్రీ ఎం.ఎస్‌. చారి గారు పిలుపునిచ్చారు. నేడు (10.09.2018) బాగ్‌ అంబర్‌పేట్‌లోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమాన్ని ఎం.ఎస్‌.చారి గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్‌ రెడ్డి గారు, లైన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు ఎస్‌. రాంమనోహర్‌, లైన్స్‌ క్లబ్‌ నాయకులు విద్య భూషన్‌, డా|| గూలబ్‌ రాణి, కాలనీ ఆఫీస్‌ బేరర్‌ రవీంద్రనాథ్‌, లత, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు మల్లం రమేష్‌, కె. వీరయ్య, నాయకులు రమణ, పి. శ్రీనివాస్‌, సురేష్‌, రాంచందర్‌ రాజు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


సెప్టెంబర్‌ 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో (హైదరాబాద్‌) జరిగింది.







6, సెప్టెంబర్ 2018, గురువారం

తెలంగాణ అసెంబ్లీ రద్దు...

               
                 అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం (06.09.2018) మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి కేబినెట్‌ తీర్మానం కాపీని అందజేశారు.
            అసెంబ్లీని రద్దు చేసి ఉత్కంఠ పెంచిన తెలంగాణ  సీఎం కేసీఆర్‌ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను  గురువారం  ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ నిరాకరించామన్నారు. 7న హుస్నాబాద్‌ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు.

3, సెప్టెంబర్ 2018, సోమవారం

వైద్యం ప్రజలందరికీ ప్రాథమిక అవసరం ...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2 న అంబర్ పేట లో  ''ఉచిత మెగా వైద్య శిబిరం'' జరిగింది.  శిబిరంలో ప్రముఖ హార్ట్‌ సర్జన్‌, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డా|| దాసరి ప్రసాద్‌రావు గారు, ప్రముఖ ఇఎన్‌టి సర్జన్‌, నోవా హాస్పిటల్‌ అధినేత డా|| ఎం. మోహన్‌ రెడ్డి గారు, , ప్రముఖ ఆర్థో సర్జన్‌ , రవి హేలియోస్‌ హాస్పిటల్‌ అధినేత డా|| బి. విజరు భాస్కర్‌ గారు , ప్రముఖ జనరల్‌ సర్జన్‌, ఆరోగ్య హాస్పిటల్‌ అధినేత డా|| మోహన్‌ గుప్త గారు , హార్ట్‌ సర్జన్‌ డా|| రవికుమార్‌ గారు, హార్ట్‌ సర్జన్‌ డా|| వెంకట్‌ గారు, డెంటల్‌ సర్జన్‌ Ê ఇండిన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యాక్షలు డా|| కె. ఆదిత్య సందీప్‌ గారు, ఇఎన్‌టి సర్జన్‌ డా|| వెంకట్‌ రెడ్డి గారు , ఇఎన్‌టి సర్జన్‌ డా|| నిలిమా గారు , ఇండో యుఎస్‌ ఐ హాస్పిటల్‌ డా|| సోఫియా ఫాతిమా గారు, సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు ఎస్‌బిఐ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్‌ రెడ్డి గారు, తదితరులు పాల్గొంన్నారు.
                 ''ఉచిత మెగా వైద్య శిబిరం'' లో గుండె, చెవి ముక్కు గొంతు, కంటి, ఎముకలు- కీళ్ళు, దంతం, జనరల్‌ వంటి ప్రధానమైన అన్ని వ్యాధులకు సంబంధించిన సమస్యల వైద్యం, టెస్టులు, అవగాహన కార్యక్రమాలు జరిగినాయి. పేషేంట్స్‌ ఉచితంగా మందులు అందజేశారు. శిబిరంలో బతుకమ్మకుంట, చుట్టు వున్న బస్తీల నుండి దాదాపు 400 మంది పాల్గొన్నారు.
                 కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రావు, ఉపాధ్యక్షులు కె. వీరయ్య, రమణ, నాయకులు పి. నాగేష్‌, సంగీత, శివ, రాంచందర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి సంస్థ మేనేజర్‌ శ్రీనివాస్‌, నాయకులు వెంకన్న, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 




1, సెప్టెంబర్ 2018, శనివారం

''ఉచిత మెగా వైద్య శిబిరం''

సెప్టెంబర్‌ 2 న అంబర్ పేట లో ''ఉచిత మెగా వైద్య శిబిరం''
పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు, ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్‌ మల్లం రమేష్‌ గారు,  ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు కె. భరత్‌ నాయక్‌, సురేష్‌, మణిక్యం, రాంచందర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.