17, సెప్టెంబర్ 2018, సోమవారం

కులం.. ప్రళయమై విరుచుకుపడినవేళ...

                     చూసినవాళ్లంతా ‘ఎంత ముచ్చటైన జంటో’నని అసూయపడితే.. ఆమె గర్వంగా ఫీలయింది! ‘మన మధ్య కులమే కదా అడ్డుగోడ? దాన్ని చెరిపేసి.. మీ తల్లిదండ్రులకు దగ్గరవుదాం’ అన్న భర్త మాటలకు ఎంతగానో మురిసిపోయింది. అతడితో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. అతడిప్పుడు లేడు! ఏదో ఒకరోజు తాను చెరిపివేస్తానని అనుకున్న కులగీతే అతడికి మరణశాసనమైంది. ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది.
                       కులం.. ప్రళయమై విరుచుకుపడినవేళ ‘ప్రణయ’ం ఓడింది!! ప్రణయ్‌తో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్న అమృతకు అతడి జ్ఞాపకాలే మిగిలాయి.

                    ‘‘కులమే మా ప్రేమకు అడ్డుపడింది. చివరికి ఆ కులమే నా ప్రణయ్‌ని చంపేసింది. కుల నిర్మూలన జరగాలని ప్రణయ్‌ అంటుండేవాడు. అందుకోసం నేను పోరాడతా! ప్రణయ్‌ ఆశయాన్ని నెరవేర్చుతా!! నేను పుట్టింటికి వెళ్లనే వెళ్లను. డాడీ, బాబాయిలకు శిక్ష పడేవరకు పోరాడుతాను’’. -అమృత వర్షిణి





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి