మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన మరవక ముందే,
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరొ ఘటన...
కులాంతర వివాహం చేసుకున్నారని నవదంపతులపై పట్టపగలే అమ్మాయి తండ్రి హత్యాయత్నం చేయడం నగరంలో కలకలం సృష్టించింది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్ ఈ నెల 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ రోజు (19.09.2018) కొత్త బట్టలు కొనిస్తానని అమ్మాయి తండ్రి ఫోన్ చేసి, ఇద్దరిని హోండా షో రూం దగ్గరకు రమ్మన్నాడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్నకత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లిని జీర్ణించుకొని మాధవి తండ్రి మనోహర చారి కక్షతో వారిపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు. సందీప్ పరిస్థితి పరవాలేదు కానీ.. అమ్మాయి పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇక మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన (14.09.2018) మరవక ముందే నగరం నడిబొడ్డున ఈ ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
మనిషిని మనిషిలా చూద్దాం...
కులం, మతం కన్నా మానవత్వం గొప్పదని చాటుదాం...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి