31, ఆగస్టు 2019, శనివారం

మట్టి గణేష్‌లనే ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం...

మట్టి గణేష్‌లనే అందరము ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని 
జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్‌ శ్రీ కృష్ణయ్య గారు పిలుపునిచ్చారు. నేడు డిడికాలనీలోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో  హైదరాబాద్‌ జిందాబాద్‌ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ''మట్టి గణేష్‌ విగ్రహాల ఉచిత పంపిణి'' కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కృష్ణయ్య గారు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షంలో కూడా కాలనీల వారు ఎక్కువ మంది హాజరైనారు.





30, ఆగస్టు 2019, శుక్రవారం

మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి...

మట్టి గణేష్‌ విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ ఇళ్ళలో మట్టి విగ్రహాలను పూజించాలని డా|| జయసూర్య గారు పిలుపునిచ్చారు.  నేడు (30.08.2019) పాత నల్లకుంటలో హైదరాబాద్‌ జిందాబాద్‌ - హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమాన్ని డా|| జయసూర్య గారు ప్రారంభించారు.
డా|| జయసూర్య గారు మాట్లాడుతూ సమాజ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని '' పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని'' అందుకు మన అందరం పాటిద్దాం అని అన్నారు. వినాయక విగ్రహాలలో అత్యధికం ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో, అనేక రకాల రసాయనిక రంగులతో తయారవుతున్నాయని, ఈ విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లోను, నగరంలోని వివిధ చెరువులలో నిమజ్జనం చెయ్యటం జరుగుచున్నదని అన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, ప్లాస్టిక్‌ కాగితాలు, పాదరసం, సీసం, క్రోమియం వంటి అనేక విష రసాయనాలు వుంటున్నాయని, ఈ విషరసాయనాలు కలపటం వలన హుస్సేన్‌ సాగర్‌ మరియు చెరువులన్నీ కాలుష్య భరితమై, దుర్గంధంతో తయారౌతున్నాయని అన్నారు. పివోపి కాలుష్యం వల్ల నీటిలోని జీవరాశులు అన్ని చనిపోతున్నాయాని, మనుషులకు క్యాన్సర్‌, చర్మవ్యాధులు వస్తున్నయాని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి గణేష్‌లను మాత్రమే పూజించాలని ప్రతిజ్ఞ చేయించారు.

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె. వీరయ్య మాట్లాడుతూ ప్రపంచంలో ఇప్పుడు కాలుష్య సమస్యనే ప్రధాన సమస్యగా మారుతున్నదని అన్నారు. ప్రపంచంలో సంవత్సరానికి దాదాపు 92 లక్షల మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారాని, దానిలో మన దేశంలోనే అధికంగా 25 లక్షల వరకు చనిపోతున్నరాని అన్నారు. అందువల్ల వినాయక చవితి సందర్భంగా మరింత కాలుష్యం పెరగకుండా పర్యావరణానికి హాని చెయ్యని మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని కోరారు.

                   ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సిటిజన్స్‌ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్‌ రావు, రిటైర్డ్‌ ఇఇ డి.రామకృష్ణరావు గారు, డిఆర్‌డిఎల్‌ ఆఫీసర్‌ వివి సుబ్రమణ్యం గారు, కృష్ణబాబు, సంజీవ్‌, రమణరావు, ప్రసాద్‌ హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్‌, డి.మోహన్‌, రమణ, సునీల్‌ , సోమేష్‌, సంతోష్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

28, ఆగస్టు 2019, బుధవారం

ప్రాథమిక వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి...

ప్రాథమిక వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల ని ప్రముఖ గుండె వైద్యులు దాసరి ప్రసాద్ రావు గారు అన్నారు.  ప్రజల నుండి  విశేష స్పందన  వస్తున్నదని , హైదరాబాద్ జిందాబాద్ కృషి అభినందనీయమని అన్నారు.
 హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం...  25.08.2019 భారత అభ్యుదయ ఉన్నత పాఠశాల జియాగూడ లో  వర్షం వచ్చినా కూడా చాలా విజయవంతంగా జరిగింది. దాదాపు 540 మంది పాల్గొన్నారు. 
 ప్రముఖ హర్ట్ సర్జన్ డాక్టర్ దాసరి ప్రసాద రావు గారు, ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు, డాక్టర్ నరేష్, డాక్టర్ నారాయణ రావు సదానంద్, డాక్టర్ సూర్య మాధవి, డాక్టర్ స్నిగ్ధ రెడ్డి, శ్రీనివాస్, మునీర్, ఇండో-యూఎస్ ఐ హాస్పిటల్ వారు పాల్గొన్నారు.
 
 





21, ఆగస్టు 2019, బుధవారం

ఒక జీవితబీమా ఏజంట్ యొక్క ఆవేదన...

ఒక జీవితబీమా ఏజంట్ యొక్క ఆవేదన - తోటి ఏజంట్ మిత్రులకు ఒక అభ్యర్థన !!

LIC లో  ఏజంట్ గా చేరాను.  ఏజంట్ లైసెన్స్ వచ్చిన మొదటి రోజున,
అత్యంత సన్నిహితుడైన ఒక మిత్రుడిని  LIC  పాలసీ  అడుగుదామని వెళ్ళాను.
'కానీ స్నేహాన్ని వాడుకుంటున్నాను అని వాడు, ఎక్కడ  అనుకుంటాడో అని మొహమాటపడి అడగలేదు'...             వాడికి లక్ష్మి లాంటి కూతురు పుట్టినప్పుడు, వెళ్లి దీవించి అడుగుదాం అని అనుకున్నాను. వాడికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా అని అనుకొని, మొహమాట పడి ఆగిపోయాను.

కానీ కార్ ఆక్సిడెంట్ లో నా మిత్రుడు  చనిపోయినప్పుడు...
సమాధి లో నుండి,  వాడు నన్ను గట్టిగా పిలుస్తున్నట్టు అనిపించి,
అక్కడే కూలబడి పోయాను...

చిన్న గా ఒక కంఠం వినిపించింది...
ఏరా !! మోహమాటంతో ఎంత పని చేసినావురా !! ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ,
ఎంతో సమయం గడిపేవారం కదా!
జీవితబీమా పాలసీ  చాలా మంచిది అని ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదురా ?
జీవితబీమా పాలసీ తీసుకోక పోవడంతో నా ఫామిలీ ఇప్పుడు ఎన్నో ఆర్ధిక ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నది. ఎంత పని అయ్యిందిరా ! రెండు గంటల సినిమా కు రెండు వందలు ఖర్చు పెట్టేవారం.  
రోజుకు 100 రూపాయలు కడితే, కోటి రూపాయల పాలసీ వస్తుందని ఎందుకు చెప్పలేదురా ?
 అంటూ నా మిత్రుడు నన్ను ప్రశ్నించినట్లు అనిపించింది.
 అందుకే,
 ప్రియమైన తోటి ఏజంట్ మిత్రులారా, ఇక నుండి మనమంతా ఒక నిర్ణయం తీసుకుందాం. మొహమాటం వీడి,
మన ప్రయత్న లోపం లేకుండా చూసుకుందాం. మన బంధుమిత్రులందరికీ జీవితబీమా పట్ల అవగాహన కల్పించుదాం. తోటి వారందరూ LIC పాలసీ కలిగి ఉండేలా చూద్దాం. ఎవరికి ఏ అనుకోని దుర్ఘటన జరిగినా,
ఆర్ధిక ఇబ్బందులు కలుగకుండా చూద్దాం.
Let us Insure Lives - Let us Ensure Smiles ...

15, ఆగస్టు 2019, గురువారం

మహానీయుల త్యాగాలను కాపాడుకోవాలి...73వ స్వాతంత్య్ర దినోత్సవం

 హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆఫీసు :
              దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని వాటర్‌ వర్క్‌ ్స డిజిఎం శ్రీనివాస్‌రావు గారు అన్నారు. నేడు (15.08.2019) హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆఫీసు వద్ద 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్య్రం యొక్క ప్రాధాన్యతను, పౌరుల బాద్యతల గురించి వివరించారు. స్వాతంత్య్రం కోసం మహానీయులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, వాటిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని అన్నారు.                
             డా|| జయసూర్య గారు మాట్లాడుతూ యువత ముందుకు వచ్చిన అన్నిసమస్యల పరిష్కారం కోసం పని చేయాలని, మహానీయుల త్యాగాల స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకోసం పాటుపడాలని అన్నారు.                  
            ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఇఎల్‌ స్కూల్‌ ఇన్‌చార్జి శ్రీమతి రేవతి గారు, వాటర్‌వర్క్‌ ్స మేనేజర్‌ సూర్యనారాయణ గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రావు, సహయ కార్యదర్శులు విజరుకుమార్‌, శ్రీరాములు ఉపాధ్యక్షులు రమణ, కె. వీరయ్య, పి. నాగేశ్వర్‌రావు, పి.శ్రీనివాస్‌ నాయకులు నవీన్‌ కృష్ణ, సైదులు, సంగీత, శ్రీలత, రమేష్‌, భీమ్‌రాజ్‌, అనిత, స్వేత తదితరులు పాల్గొంన్నారు.


పాత నల్లకుంట ఏరియా స్ట్రీట్‌ నెం.14 లో :
                       స్వాతంత్య్రం కోసం మహానీయులు చేసిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేస్తూ, వాటిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని సిటిజన్స్‌ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్‌ రావు గారు అన్నారు. పాత నల్లకుంట ఏరియా స్ట్రీట్‌ నెం.14 లో ( సిండికేట్‌ బ్యాంక్‌ - క్షత్రియా టవర్స్‌ లైన్‌ మధ్య ) నేడు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. 
                         మోహన్‌ రావు గారు మాట్లాడుతూ స్వాతంత్య్రం యొక్క ప్రాధాన్యతను, పౌరుల బాద్యతల గురించి వివరించారు. యువత ముందుకు వచ్చిన అన్నిసమస్యల పరిష్కారం కోసం పని చేయాలని, మహానీయుల త్యాగాల స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకోసం పాటుపడాలని అన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు అందరూ కృషి చేయాలని ఆయన ఉద్భోదించారు.
                         ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ నాయకులు ఎస్‌. లక్ష్మయ్య గారు, డి. రామకృష్ణరావు , డా.జయసూర్య, డా|| అమర్‌నాథ్‌ , కృష్ణబాబు, వివి సుబ్రమణ్యం, సంజీవ్‌, రమణరావు, హర్ష , ప్రసాద్‌ ' హైదరాబాద్‌ జిందాబాద్‌ ' ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు డి. మోహన్‌, పి. శ్రీనివాస్‌, రమణ, సోమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


73 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ...హైదరాబాద్‌ జిందాబాద్

మీకు, 
మీ కుటుంబ సభ్యులందరికి 
73 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 
మరియు  
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...
- వీరయ్య, హైదరాబాద్‌ జిందాబాద్

5, ఆగస్టు 2019, సోమవారం

స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా....

 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు....

        స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం...
        స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం... అన్నాడో సినీ కవి. అందుకే ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా స్నేహ బంధం మాత్రమే మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఆధునిక స్నేహాలు... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆధునాతన టెక్నాలజీ వరంగా స్నేహం సరికొత్త పుంతలు తొక్కుతొంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని మంచిని పెంచుకోవాల్సిందిపోయి చెడు మార్గాలు పట్టడం, దానికి స్నేహం అనే ముసుగు వేయడం బాధాకరమైన విషయం. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌...వంటి వాటిని వినియోగించుకోవడంలో ముందున్న యువత ముక్కుమొఖం తెలియనివారితో అవసరానికి మించి చనువు ప్రదర్శించడం, అవతలి వ్యక్తి ఆడో మగో కూడా తెలియకుండా స్నేహం చేయడం వంటి వాటివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం రోజు చేస్తున్నాం. కొందరు స్వార్థపరుల వల్ల స్నేహం కూడా వ్యాపారానికి గురవుతున్న సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాను మంచిగా ఉపయోగించుకున్న వారికి మంచి స్నేహితులు లభిస్తారు. కాబట్టి ఈ అత్యంత ఆధునిక యుగంలోనూ మంచి స్నేహానికి ఉన్న వన్నె తగ్గలేదు.
         స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా....
         ఎదుటి వారిలోని కోపాన్ని, లోపాన్ని భరించే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఓ నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనపుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెంచిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే మంచి ఔషదం స్నేహం. తమకు అవసరమైనపుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది. వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది.

3, ఆగస్టు 2019, శనివారం

పొంగిపోరులుతున్న డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని...

విద్యానగర్‌ లో 37 రోజుల నుండి పొంగిపోరులుతున్న డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని... 01.08.19 న హెచ్‌.ఎం.డబ్ల్యు.ఎస్‌.ఎస్‌.బి (చిలకలగూడ)డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ శ్రీ శ్రీనివాస్ రావు గారికి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించి, చర్చిచడం జరిగింది.అదే పనిలో ఉన్నాము అని, వెంటనే మొత్తం సమస్య పరిష్కరిస్తామని సనుకూలగా స్పందించారు. 
                   ఈ కార్యక్రమంలో శోభాపావని అఫార్ట్‌మెంట్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు నర్సింహ్మా రావు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు వీరయ్య, నాయకులు పి.శ్రీనివాస్‌, రమణ, క్రాంతి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.