29, జూన్ 2011, బుధవారం

ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు....


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుడా ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు. పాల ప్యా కెట్ కోసమో, వంట సరుకుల కోసమో కిరాణా దుకాణాలకు బయలుదేరడం ఇకముందు సాధ్యం కాకపోవచ్చు.  ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం అమల్లోకి రానుండటమే దీనికి కారణం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ..ప్లాస్టిక్ సంచుల వాడకంపై పాక్షిక నిషేధం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి మనం మద్దతు పలుకుద్దాం.             
           40 మైక్రాన్ కన్నా తక్కువ మందం ఉండే సంచులపై వేటుకు పరిమితమయింది. జూలై 1 నుంచి గట్టిగా నిషేధం అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. ఈ వివరాలను కార్పొరేషన్ కమిషనర్ కృష్ణబాబు మీడియాకు వెల్లడించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ప్లాస్టిక్‌కప్పులు, కవర్లను నిషేధిస్తున్నట్టు తెలిపారు. పూర్తి నిషేధం అంశంపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు.  పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో పాటు న్యాయనిపుణులతో చర్చించి.. 40 మైక్రాన్లలోపు పరిమితిని విధించామన్నారు.  బవిష్యత్ లొ ఐన పూర్తి నిషేధం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాం ,జీహెచ్ఎంసీ చర్యలు  తిసుకొవాలి
      
             మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.  వాతావరణ సమతుల్యం కోల్పోయి ఓజోన్‌పొర దెబ్బతినడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  దీంతో క్యాన్సర్, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.  ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ఆవరణలో చెట్లను నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, వాహన కాలుష్యం తగ్గించాలి.  పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం  మనందరి మీద ఉంది.
          ఒకరికి ఒకరు  తోడైతే మన పర్యావరణాన్ని ఈ కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులతో పాటు ప్లాస్టిక్‌కప్పులు, కవర్లను నిషేద్దన్ని అమలు  పై అవగాహన కల్పించి ఈ సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం. 
          అందుకే రండి.. ఆ ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!

(  పత్రికల  సహకారంతో ...)

18, జూన్ 2011, శనివారం

నువ్వు నేను స్నేహం...


నువ్వూ నేనూ  అంటే  అది కలహం...
నువ్వే నేనంటే అంటే  అది స్నేహం...

నీవెంటే నేనంటే నిద్రలో కూడా ...
నువ్వూ నేనూ కలిసుంటే అది స్వర్గం.





16, జూన్ 2011, గురువారం

మొబైల్ తో బ్రెయిన్‌ ట్యూమర్‌ ... !

 ఇంట్లో టీవీ, చేతిలో మొబైల్ ! ఎక్కడ చూసినా ఇదే దృశ్యం ! కనబడుతుంది.
'టీవీ' ప్రేక్షకులకు, సెల్లు ప్రియులకు శాస్త్రవేత్తలు మరో హెచ్చరిక చేశారు. టీవీ అతిగా చూస్తే త్వరగా మరణిస్తారని ఒకరు పేర్కొనగా... మొబైల్ ఎక్కువగా వాడితే తమ సహజప్రవర్తన మరచిపోయి మూర్ఖులుగా మారే ప్రమాదముందని మరో అధ్యయనంలో తేలింది. రోజుకు 2 గంటలు టీవీ చూసేవారికి టైప్ 2 ధుమేహం, గుండెజబ్బులు వస్తాయని హార్వ ర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (హెచ్ఎస్‌పీహెచ్) కు చెందిన నిపుణులు తెలిపారు. రోజుకు మూడుగంటలపాటు చూస్తే...   'ముందస్తు మరణం' తథ్యమన్నారు. శారీరక శ్రమను ప్రోత్సహించడంతోపాటు... టీవీ చూడటంలాంటి 'నిశ్చేష్ట' పనులను త్యజించాలని సూచించారు. 
                ఇక సెల్‌ఫోన్ల వాడకంవల్ల నానారకాల సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. మొబైల్‌ను అతిగా ఉపయోగించడంవల్ల మన ధోరణిలోనూ మార్పు వస్తుంద ని ఆస్ట్రేలియాకు చెందిన టెల్‌స్ట్రా సంస్థ జరిపిన ఆన్‌లైన్ సర్వేలో తేలింది. కొందరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వారి ప్రవర్తన, ధోరణిల్లో మార్పు కన్పిస్తుందని, కొందరు మూర్ఖంగా తయారవుతారని ఇందులో స్పష్టమైంది.  

15, జూన్ 2011, బుధవారం

నిండు పున్నమి... పండువెన్నెల... అంతలోనే మహాద్భుతం.

నిండు పున్నమి... పండువెన్నెల... అంతలోనే మహాద్భుతం. వెన్నెల మటుమాయం అవుతుంది. ఆకాశమంతటా గాఢాంధకారం అలముకుంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం చేసే తమాషా ఇది. ఆకాశంలో అద్భుతాలను ఆసక్తిగా తిలకించే ఖగోళప్రియులకు నేడే ( బుధవారం) పండగే. ఈ శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఖగోళప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి అరుదైన, సుదీర్ఘ సమయం ఉండే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే 130 ఏళ్లు ఆగాల్సిందే!

               చంద్రగ్రహణం పట్టినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకూడదన్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని బిర్లా సైన్స్ ఆడిటోరియం(హైదరాబాద్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాంటి అనుమానాలూ లేకుండా... చంద్ర గ్రహణాన్ని ప్రతిఒక్కరూ చూడొచ్చని అంటున్నారు.
              భారత స్థానిక కాలమానం ప్రకారం జూన్ 15 రాత్రి 11:52:26 గంటలకు గ్రహణం మొదలవుతుంది. చంద్రుడు పూర్తిగా అదృశ్యమయ్యేది: అర్ధరాత్రి 12:52:30 నుంచి 02:32:42గంటల నడుమ చంద్రుడు భూమి నీడలో పూర్తిగా అదృశ్యమవుతాడు. జూన్ 16 తెల్లవారుజామున 02:32:42 గంటల నుంచి మళ్లీ పాక్షికంగా కనిపించడం మొదలై 03:32:15గంటలకు గ్రహణం ముగుస్తుంది. మనదేశం అంతటా కనిపిస్తుంది.
                నాసా లెక్కల ప్రకారం 2011లో నాలుగు పాక్షిక సూర్య గ్రహణాలు, రెండు సంపూర్ణ చంద్రగ్రహణాలు సంభవిస్తున్నాయి. ఇలా జరగడం చాలా అరుదు. 21 శతాబ్దం మొత్తమ్మీదా ఈ ఏడాది కాకుండా మరో ఐదు సార్లు మాత్రమే ఇలా జరగనుంది. ఆ సంవత్సరాలు... 2029, 2047, 2065, 2076, 2094.
     ఇంతటి అరుదైన, సుదీర్ఘ సమయం ఉండే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మళ్లీ చూడాలంటే 130 ఏళ్లు ఆగాల్సిందే!
            గ్రహణం నేపథ్యంలో... ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించేందుకు  మన వంతు కృషి చేద్దాం.
(  పత్రికల  సహకారంతో ...)

వేసవిలో కూల్ కూల్ గా ఆహ్లాదకరంగా ఎంజయ్ ...

  మేము మరియు ఈద్దరు  స్నేహితుల  కుటుంబ సభ్యులతో  ఈ మధ్య (మే చివర )   వేసవి సెలవులలో  కూల్ కూల్ గా  ఆహ్లాదకరంగా  ఎంజయ్ ... చేశాం. ఊటి , కొచిన్ , అలాప్పి, తిరువనంతపురం, కన్యాకుమారి , మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం ( మదురై ), రామేశ్వరము, కొడైకెనాల్, చెన్నై, కాంచీపురం లో పర్యటించాం. చెన్నై, కాంచీపురం ఎండల్లోనే పర్యటన కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ  మిగిత ప్రాంతాలు కూల్ కూల్ గా  ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు,  బీచ్చిలు  ఆహ్లాదకరంగా అనిపించింది.  పిల్లలకైనా, పెద్దలకైనా పర్యటనలు అనేవి వినోదం, ఆనందం కలిగించడంతోపాటు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి. మేము 9 రోజులలొ  14 ప్రదేశాలను దాదాపు 4300 కీ.మీ. తిరిగినాము.  ఖర్చు  కుడా ఒకొకరికి  రూ.4000 ఐంది.  తక్కువ సమయంలో  తక్కువ ఖర్చుతొ ఎక్కువ చూశాం.          
విశేషాలేంటో చూద్దాము. 
1.ఊటీ : తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఒక ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రం. నీలగిరి జిల్లాకు ప్రధాన పట్టణం. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉంటుంది . ఇది మంచి వేసవి విడిది కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి 2,240 మీటర్ల ఎత్తులో ఉంది.  దీని అద్భుత సౌదర్యం, ఎటు చూసిన కనిపించే పచ్చదనం, ముచ్చటగొలిపే లోయలు మొదలైన వాటికి చుస్తె ఏవరైన ముగ్ధులై పోతారు.  ఈక్కడ నీరు త్రాగటానికి  వేడి చేస్తారు. అంత కూల్ గా వుంది.  చూడవలసిన ప్రదేశాలు  :  బొటానికల్ గార్డెన్స్ ( అద్భుత సౌదర్యం ),  బోట్‌హౌస్,  కాఫీ తోటలు
2. కోయంబత్తూరు :  తమిళనాడు రాష్ట్రములోని రెండవ అతిపెద్ద నగరం. కోయంబత్తూరు జిల్లా యొక్క ముఖ్యస్థానమైన ఈ నగరం దక్షిణ భారత మాంచెస్టర్ గా పేరుగాంచినది.  కోయంబత్తూరు నగరం, వస్త్ర పరిశ్రమలకు, ఇంజనీరింగు కర్మాగారాలకు, వాహన విడిభాగాల నిర్మాణకేంద్రాలకు, వైద్య సౌకర్యాలకు, విద్యాసంస్థలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి, ఆతిధ్యానికి మరియు ప్రత్యేకత కలిగిన కొంగు తమిళ మాండలికానికి ప్రసిద్ధి చెందినది.
కేరళ సరిహద్దులలో  మేము  ప్రవేసించగనే వర్షలు ప్రారంభం. రైలులొనే చల్లచల్లగా  జల్లులు.  
  


  ౩. కొచ్చిన్  :   ఓడరేవు , బీచ్చి , బోట్‌హౌస్.  : సాయంకాలం బోట్‌ లో చల్లచల్లగా ప్రయానం  చేశాం.     

4. ఏర్నకులం  పట్టణం లో  కూల్ కూల్ గా   సాయంకాలం  వర్షం.    
5 .అల్లాప్పి : బ్యక్ వాటర్ లో  బోట్‌ లో 4 గంటలు  ప్రయానం  చేశాం. చాల  ఆహ్లాదకరమైన వాతావరణాన్ని , అనుభుతిని చూశాం.   వాటర్ లో   బోట్‌ స్టాపులు , గ్రామాలు  వసుతునే వుంటాయి. ఎటూ చూసిన వాటర్.               
6.
అల్లాప్పి బీచ్చి : పిల్లలు  మరి ఎక్కువ  ఎంజయ్ చేశారు .  స్నానాలు చేశాం , ఎంజయ్ చేశాం 

14, జూన్ 2011, మంగళవారం

యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే  రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి   నేటికీ ఆదర్శం   
ప్రపంచంలో ఎకడచుసినా  నీ రూపం...

ఏ   కీ చైన్  చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...  

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

             చే గెవారా   దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు.  రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ  వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
              అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో
చే జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు.  విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు

5, జూన్ 2011, ఆదివారం

మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది....

 మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.  వాతావరణ సమతుల్యం కోల్పోయి ఓజోన్‌పొర దెబ్బతినడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  దీంతో క్యాన్సర్, చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.  ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ఆవరణలో చెట్లను నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి, వాహన కాలుష్యం తగ్గించాలి.  పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం  మనందరి మీద ఉంది.
               ఒకరికి ఒకరు  తోడైతే మన పర్యావరణాన్ని ఈ కాలుష్య భూతానికి బలికాకుండా కాపాడగలుగుతాం. మన కాలనీలలో, మనం వుండే గృహ సముదాయాలలో ఈ విషయం పై అవగాహన కల్పించి ఈ సత్కార్యానికి చేయూతనిస్తే మన భూమిని మరుభూమి కాకుండా చూడగలుగుతాం.
            అందుకే రండి.. ఆ ఆనందం లో మనమూ పాలుపంచుకొని, మనవంతు పని మనం చేసి మన తరువాతి తరాలకు పచ్చని పర్యావరణాన్ని శోభాయమానంగా అందిద్దాం..!

                 నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం... అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. అంతేగాకుండా, మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహనవేగం పెంచుతూ.. ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌ వంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జలవనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.

               కాబట్టి పిల్లలూ.. పెద్దలు   ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే, ముందు ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి. దీనికి పర్వావరణ పరిరక్షణ ఒక్కటే నివారణ మార్గమని ఐక్యరాజ్యసమితి కూడా నినదిస్తోంది. అందులో భాగమే.. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటించటం.. ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా పరిణమించిన వాతావరణ కాలుష్యాన్ని నివారించే క్రమంలో మానవులంతా బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సిన సమయం ఆసన్నమైంది.

               మన  వంతుగా జూన్‌ 5వ తేదీన ఒక మొక్కను నాటండి...! 
మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది.
( ప్రజాశక్తి, ఇతర పత్రికల  సహకారంతో ...)