30, ఆగస్టు 2018, గురువారం

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... హెచ్ ఎం డి ఏ కమీషనర్‌ డా|| బి. జనార్థన్‌ రెడ్డి

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ... నేడు(30.08.2018) పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న 
హెచ్ ఎం డి ఏ కమీషనర్‌ డా|| బి. జనార్థన్‌ రెడ్డి గారు,  హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి గారు, అంజయ్య , రవీందర్ రెడ్డి , వీరయ్య, రమణ, భరత్, మానిక్యం ...
మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అని  పిలుపు ఇచ్చారు.   




27, ఆగస్టు 2018, సోమవారం

కేరళను మానవత్వం తో ఆదుకుందాము...

కవులు, గాయకులు, కళాకారులందరూ...
ఇలా కేరళ గురించి స్పందిస్తున్న అందరికీ 
కళాభివందనములు.
భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను మానవత్వం తో ఆదుకుందాము...

23, ఆగస్టు 2018, గురువారం

జేఈఈ మెయిన్స్‌ రెండుసార్లు.... నీట్‌ ఒకేసారి .....

జనవరి 31, ఏప్రిల్‌ 30వ తేదీల్లో జేఈఈ మెయిన్స్‌
మే 5న నీట్‌
పరీక్షల షెడ్యూలు విడుదల
                 ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ రెండుసార్లు, నీట్‌ ఒకేసారి నిర్వహించనున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జేఈఈ మెయిన్స్, నీట్‌ తదితర పరీక్షల షెడ్యూలును మంగళవారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌–1 పరీక్షను జనవరి 31న, జేఈఈ మెయిన్‌–2 పరీక్షను ఏప్రిల్‌ 30న నిర్వహించనుంది. నీట్‌ (యూజీ)ను జూన్‌ 5న, యూజీసీ నెట్‌ పరీక్షను జనవరి 10న, సీమ్యాట్, జీప్యాట్‌ పరీక్షలను ఫిబ్రవరి 10న నిర్వహించనున్నట్టు తెలిపింది. జేఈఈ మెయిన్స్, నీట్‌ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నట్టు జూలై 7న ప్రకటించినప్పటికీ.. నీట్‌ పరీక్షను మాత్రం ఒకేసారి నిర్వహించనున్నట్టు, అది కూడా ఆఫ్‌లైన్‌ (పెన్ను, పేపర్‌) ద్వారానే నిర్వహించనున్నట్టు వెల్లడించింది. గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఉండాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన వినతి మేరకు ఈ మార్పు చేసినట్టు తెలిపింది. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే పరీక్షలకు పూర్తి సంసిద్ధత కోసం దేశవ్యాప్తంగా టెస్ట్‌ ప్రాక్టీస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్‌ సెంటర్లు ఉన్న పాఠశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలలను గుర్తించి 2,697 కేంద్రాలను శని, ఆదివారాల్లో ప్రాక్టీసు చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్‌ 1 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొంది. 


పరీక్ష :  జేఈఈ మెయిన్‌–1
పరీక్ష విధానం :    కంప్యూటర్‌ ద్వారా
రిజిస్ట్రేషన్‌ తేదీలు :  2018 సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు 
అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌ :    2018 డిసెంబర్‌ 17
పరీక్ష తేదీ :  2019 జనవరి 6 నుంచి 20 వరకు
ఫలితాలు  :  2019 జనవరి 31
పరీక్ష  :  జేఈఈ మెయిన్‌–2
పరీక్ష విధానం : కంప్యూటర్‌ ద్వారా
రిజిస్ట్రేషన్‌ తేదీలు :    2019 ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు 
అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌  :    2019 మార్చి 18
పరీక్ష తేదీ :    2019 ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు
ఫలితాలు :  2019 ఏప్రిల్‌ 30 

పరీక్ష: నీట్‌ (యూజీ)
పరీక్ష విధానం: పెన్ను, పేపర్‌ ద్వారా
రిజిస్ట్రేషన్‌ తేదీలు: 2018 నవంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30 వరకు
అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: 2019 ఏప్రిల్‌ 15
పరీక్ష తేదీ: 2019 మే 5
పరీక్షల ఫలితాలు: 2019 జూన్‌ 5

22, ఆగస్టు 2018, బుధవారం

కేరళను ఆదుకుందాం...

కేరళలో వరదలు సృష్టించిన బీభీత్సవాన్ని టివిల్లో, పత్రికల్లో చూసి చలించిన ప్రతి హృదయమూ స్పందిస్తోంది. వరద బాధితులకు సాయం చేయడానికి ఎందరో మానవత్వం తో ముందుకొస్తున్నారు. చేయూతనందిస్తున్నారు. తలో చేయి వేసి ఆదుకుందాము. మీరు మీ వంతు సాయాన్ని అందించంది...
 


18, ఆగస్టు 2018, శనివారం

ఆరోగ్యశాఖ మంత్రి గారికి వినతి పత్రం ...

ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ హాస్పిటల్‌ను అటానమస్‌ చేయ వద్దు అని
ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ లక్ష్మారెడ్డి గారికి హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 
18.08.2018 వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 
ప్రస్తుత పరిస్థితి ని కొనసాగిస్తమని, ఛార్జీలు ఉండవు అని మంత్రి గారు హామి ఇచ్చారు.


13, ఆగస్టు 2018, సోమవారం

మొక్కలు నాటి పర్యావరణ రక్షణ కోసం కృషి ... Hyderabad zindabad

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జరిగిన '' హరిత హారం '' కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి జోనల్‌ కమీషనర్‌ శ్రీ రఘుప్రసాద్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం (12.08.2018 ) ఆజమాబాద్‌ ఇండిస్టేయల్‌ ప్రాంతంలో జరిగింది. కార్యక్రమంలో రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీ శ్రీనివాస్‌ రెడ్డి గారు, జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్‌ శ్రీ కృష్ణ శేఖర్‌ గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌ రావు గారు అతిథులు మరియు హాజరైన అందరు మొక్కలు నాటి పాలు పంచుకున్నారు. పట్టణీకరణతో వాహనాలు సంఖ్య పెరిగి వాతావరణ కాలుష్యం పెరుగుతున్నదాని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి నగరంలో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు నిచ్చారు. మొక్కలు నాటి పర్యావరణ రక్షణ కోసం తమ వంతు కృషి చేయాలని అన్నారు.







10, ఆగస్టు 2018, శుక్రవారం

ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ హాస్పిటల్‌ను అటానమస్‌ చేయరాదు...

10.08.2018 న హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం సంఘం అధ్యక్షులు పాశం యాదగిరి ఆధ్వర్యంలో జరిగింది. 
క్యాన్సర్‌ వ్యాధి చికిత్స సుదీర్ఘకాలం జరగాల్సినది, ఖరీదైనది కావున పేద ప్రజలు వైద్యం చేయించుకోలేరు. కావున ప్రభుత్వ ఉచిత వైద్యమే ఉండాలని, ఎం.ఎన్‌.జె.లో సంవత్సరానికి 12,000 మంది పేషెంట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీష్‌ఘడ్‌ నుండి కూడ వస్తారని వారికి ఉచిత సేవలు అందిస్తున్నదని ఎం.ఎన్‌.జె. డాక్టర్స్‌ .. ఎంప్లాయీస్‌ జె.ఎ.సి. చైర్మన్‌ డా||సాయిరాం తెలియజేశారు. అటానమస్‌ అయితే యూజర్‌ చార్జీలు ప్రవేశపెడతారు. పేద ప్రజలు డబ్బులు చెల్లించి వైద్యం చేసుకోలేరని, వారి కోసం ప్రభుత్వం ఆలోచించి తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు.
ఇందులో టిడిపి నగర అద్యక్షులు ఎం.ఎన్‌.శ్రీనివాస్‌, సిపిఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వెంకటేష్‌ అదే విధంగా ఎం.ఎన్‌.జె. హాస్పిటల్‌ డాక్టర్లు సాయిరాం, డా||శ్రీకాంత్‌, డా||రమేష్‌ మరియు సిబ్బంది హాజరైనారు.