జనవరి 31, ఏప్రిల్ 30వ తేదీల్లో జేఈఈ మెయిన్స్
మే 5న నీట్
పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ రెండుసార్లు, నీట్ ఒకేసారి నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. జేఈఈ మెయిన్స్, నీట్ తదితర పరీక్షల షెడ్యూలును మంగళవారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్–1 పరీక్షను జనవరి 31న, జేఈఈ మెయిన్–2 పరీక్షను ఏప్రిల్ 30న నిర్వహించనుంది. నీట్ (యూజీ)ను జూన్ 5న, యూజీసీ నెట్ పరీక్షను జనవరి 10న, సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలను ఫిబ్రవరి 10న నిర్వహించనున్నట్టు తెలిపింది. జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నట్టు జూలై 7న ప్రకటించినప్పటికీ.. నీట్ పరీక్షను మాత్రం ఒకేసారి నిర్వహించనున్నట్టు, అది కూడా ఆఫ్‌లైన్ (పెన్ను, పేపర్) ద్వారానే నిర్వహించనున్నట్టు వెల్లడించింది. గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఉండాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేసిన వినతి మేరకు ఈ మార్పు చేసినట్టు తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలకు పూర్తి సంసిద్ధత కోసం దేశవ్యాప్తంగా టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్ సెంటర్లు ఉన్న పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలను గుర్తించి 2,697 కేంద్రాలను శని, ఆదివారాల్లో ప్రాక్టీసు చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొంది.
పరీక్ష : జేఈఈ మెయిన్–1
పరీక్ష విధానం : కంప్యూటర్ ద్వారా
రిజిస్ట్రేషన్ తేదీలు : 2018 సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడింగ్ : 2018 డిసెంబర్ 17
పరీక్ష తేదీ : 2019 జనవరి 6 నుంచి 20 వరకు
ఫలితాలు : 2019 జనవరి 31
పరీక్ష : జేఈఈ మెయిన్–2
పరీక్ష విధానం : కంప్యూటర్ ద్వారా
రిజిస్ట్రేషన్ తేదీలు : 2019 ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడింగ్ : 2019 మార్చి 18
పరీక్ష తేదీ : 2019 ఏప్రిల్ 6 నుంచి 20 వరకు
ఫలితాలు : 2019 ఏప్రిల్ 30
పరీక్ష: నీట్ (యూజీ)
పరీక్ష విధానం: పెన్ను, పేపర్ ద్వారా
రిజిస్ట్రేషన్ తేదీలు: 2018 నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడింగ్: 2019 ఏప్రిల్ 15
పరీక్ష తేదీ: 2019 మే 5
పరీక్షల ఫలితాలు: 2019 జూన్ 5
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి