10, ఆగస్టు 2018, శుక్రవారం

ఎం.ఎన్‌.జె. క్యాన్సర్‌ హాస్పిటల్‌ను అటానమస్‌ చేయరాదు...

10.08.2018 న హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం సంఘం అధ్యక్షులు పాశం యాదగిరి ఆధ్వర్యంలో జరిగింది. 
క్యాన్సర్‌ వ్యాధి చికిత్స సుదీర్ఘకాలం జరగాల్సినది, ఖరీదైనది కావున పేద ప్రజలు వైద్యం చేయించుకోలేరు. కావున ప్రభుత్వ ఉచిత వైద్యమే ఉండాలని, ఎం.ఎన్‌.జె.లో సంవత్సరానికి 12,000 మంది పేషెంట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీష్‌ఘడ్‌ నుండి కూడ వస్తారని వారికి ఉచిత సేవలు అందిస్తున్నదని ఎం.ఎన్‌.జె. డాక్టర్స్‌ .. ఎంప్లాయీస్‌ జె.ఎ.సి. చైర్మన్‌ డా||సాయిరాం తెలియజేశారు. అటానమస్‌ అయితే యూజర్‌ చార్జీలు ప్రవేశపెడతారు. పేద ప్రజలు డబ్బులు చెల్లించి వైద్యం చేసుకోలేరని, వారి కోసం ప్రభుత్వం ఆలోచించి తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు.
ఇందులో టిడిపి నగర అద్యక్షులు ఎం.ఎన్‌.శ్రీనివాస్‌, సిపిఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వెంకటేష్‌ అదే విధంగా ఎం.ఎన్‌.జె. హాస్పిటల్‌ డాక్టర్లు సాయిరాం, డా||శ్రీకాంత్‌, డా||రమేష్‌ మరియు సిబ్బంది హాజరైనారు.వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి