కిరణం - వీరయ్య కె

29, జనవరి 2019, మంగళవారం

ఫిబ్రవరి 3 వ తేదీ న రవీంద్రభారతిలో కల్చరల్‌ ఫెస్ట్‌ ... హైదరాబాద్‌ జిందాబాద్‌

           హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ''స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌'' కల్చరల్‌ ఫెస్ట్‌ ప్రచార పోస్టర్‌ను ఈ రోజు (29.01.2019) టూరిజం, కల్చరల్‌ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారు సచివాలయం మీడియా పాయింట్‌లో ఆవిష్కరించారు.
             ఈ సందర్భంగా శ్రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం ఒక మినీ భారత్‌. అన్ని రాష్ట్రాల ప్రజానీకం ఈ నగరంలో నివాసముంటున్నారని అన్నారు. హైదరాబాద్‌లో కైట్‌ ఫెస్టివల్‌, స్వీట్‌ ఫెస్టివల్‌, లిటరరీ ఫెస్ట్‌, బుక్‌ ఫెయిర్‌ లాంటివి జయప్రదంగా నిర్వహించామని, కల్చరల్‌ ఫెస్ట్‌ ఇవన్నీ వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను దర్శిస్తే దేశంలో అన్ని రాష్ట్రాల సంస్కృతులను చూడొచ్చని, హైదరాబాద్‌ ఒక టూరిస్ట్‌ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ఫిబ్రవరి 3 వ తేదీ న హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో కల్చరల్‌ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారని, అందులో బెంగాల్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మొత్తం 8 రాష్ట్రాల సంస్కృతులు ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు ఉంటాయని, దీనిద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేలా కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని, నగర ప్రజానీకం వీటిని తిలకించి జయప్రదం చెయ్యాలని అన్నారు.
          ఈ కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి, కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎన్‌.సంజీవరెడ్డి, కె.వీరయ్య, ఎ.ఎ.కె.అమీన్‌ లు పాల్గొన్నారు.

వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 11:44 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: కొన్ని మా జ్ఞాపకాలు, చిత్రకళ కళ.., హైదరాబాద్‌ జిందాబాద్‌

22, జనవరి 2019, మంగళవారం

తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో...

తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతోంది. 
4,470 పంచాయతీలకు (ఏకగ్రీవంతో కలిపి) ఎన్నికలు జరిగాయి. కడపటి వార్తలు అందేసరికి 
టీఆర్‌ఎస్‌ ఏకంగా 2,769 పంచాయతీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 917 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 66, టీడీపీ 29, సీపీఎం 33, సీపీఐ 14 చోట్ల గెలుపొందాయి. ఇతరులు 642 పంచాయతీల్లో పాగా వేశారు.


వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 5:52 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: ఎన్నికలు, తెలంగాణ రాష్ర్టం

10, జనవరి 2019, గురువారం

జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో బంగారు పతకాలను సాధించిన వారిని సన్మానించింది....

జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో విశేష ప్రతిభ ప్రదర్శించి బంగారు పతకాలను సాధించిన కుమారి రహమతున్నీసా బేగం, సాయిలలిత్‌ కుమార్‌లను హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ఈ రోజు (10.01.2019) ప్రెస్‌క్లబ్‌లో సన్మానించింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిహెచ్‌ఎంసి స్పోర్ట్స్‌ ఓ.ఎస్‌.డి. డా|| ఎస్‌.ఆర్‌.ప్రేమ్‌రాజ్‌గారు, టిఎస్‌ఆర్‌టిసి సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ శ్రీ జి.ఆర్‌. కిరణ్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ పాశం యాదగిరి హాజరై ప్రసంగించారు. గోల్డ్‌మెడల్‌ సాధించిన యువ క్రీడాకారులకు, వారికి శిక్షణ నిచ్చిన కోచ్‌లు శ్రీ గంగరాజు, శ్రీ సుమిత్‌లను శాలువా కప్పి సత్కరించారు.
జిహెచ్‌ఎంసి స్పోర్ట్స్‌ ఓ.ఎస్‌.డి. డా|| ప్రేమ్‌రాజ్‌ గారు మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరానికి చెందిన విద్యార్ధులు ఆర్చరీ, వెయిట్‌ లిఫ్టింగ్‌లలో గోల్డ్‌ మెడల్స్‌ సాధించటం హర్షనీయమని, వారికి ప్రోత్సాహమిచ్చిన తల్లిదండ్రులను, పట్టుదలతో శిక్షణనిచ్చిన కోచ్‌లను అభినందించారు. టిఎస్‌ఆర్‌టిసి సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ శ్రీ జి.ఆర్‌. కిరణ్‌ మాట్లాడుతూ తాను వాల్‌బాల్‌ జాతీయ జట్టులో ఆడానని, క్రీడలలో ప్రవేశం కారణంగానే తానీస్థితిలో ఉన్నానని, విద్యార్ధులు, యువజనులందరూ తమ దిన చర్యలో క్రీడలను భాగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థ క్రీడాకారులను అభినందిస్తూ మంచి కృషి చేస్తున్నదని అన్నారు. రహమతున్నీసా బేగం జాతీయ స్థాయిలో 4 గోల్డ్‌ మెడల్స్‌ సాధించటం అభినందనీయమని ఆమె విజయంలో కోచ్‌ గంగరాజుగారిని వెయిట్‌ లిఫ్టింగ్‌లో సాయిలలిత్‌ కుమార్‌కు శిక్షణ నిచ్చిన సుమిత్‌ను అభినందించారు.


ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, టిఎన్‌వి రమణ, జె.కె.శ్రీనివాస్‌, పి.మోహన్‌లు నాయకత్వం వహించారు. కార్యక్రమానికి గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన యువ క్రీడాకారుల పేరెంట్స్‌ ఎస్‌.నిస్సార్‌ అహ్మద్‌, వి.సత్యనారాయణలు హాజరైనారు.




వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 9:00 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: క్రీడలు..., హైదరాబాద్‌ జిందాబాద్‌

9, జనవరి 2019, బుధవారం

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు...

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు...
08.01.2019

వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 9:53 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: బారత దేశం, సామాజికం...

6, జనవరి 2019, ఆదివారం

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం...

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నేడు 06-01-2019 న జరిగింది.
డా|| ఎం.ఉపేందర్‌ రెడ్డి గారు, డా|| వై.ఎం.ఎం.రాజు గారు, డా|| బి.వేణుగోపాల్‌ గారు, డా|| ఆర్‌.రవి గారు పాల్గొని ఈ వైద్య శిబిరంలో ఉచిత సేవలందించారు. వాలంటీరులు పాశం యాదగిరి, శ్రీనివాసరావు, కె.వీరయ్య, రమణ, పి. నాగేశ్వర్‌రావు, వి.విజరుకుమార్‌, పి.శ్రీనివాస్‌, జెకె శ్రీనివాస్‌, పి. నాగేష్‌, రాజ్యలక్ష్మి, దుర్గ, సంగీత, లత, మెఘన, నిహారిక, హస్మిత, శిరిష, నవీన్ కుమార్, శ్రీరాములు, మణిక్యం, ప్రభాకర్ రావు, అజయ్, మోహన్‌ రెడ్డి,శివ శంకర్, రమేష్‌, రాములు తదితరులు పాల్గొంన్నారు.
ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.00 గం||ల వరకు జరుగుతుంది.
మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.



వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 7:05 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: ఆరోగ్యం, హైదరాబాద్‌ జిందాబాద్‌

4, జనవరి 2019, శుక్రవారం

పంచాయతీ ఎన్నికలు ...

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల :
మూడు విడతలుగా ఈనెల 7 నుంచి 21వరకూ మెదట విడత, 
11 నుంచి 25 వరకు రెండో విడతలో
 16 నుంచి 30 వరకూ మూడో విడతగా




వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 10:35 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: ఎన్నికలు

3, జనవరి 2019, గురువారం

తెలంగాణ హైకోర్టు షురూ...

తెలంగాణ హైకోర్టు షురూ

- తొలి సీజేగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

- తొమ్మిది మంది న్యాయమూర్తులు కూడా

- కొత్త చరిత్రకు శ్రీకారం

                తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహ న్‌ ప్రమాణం చేయించారు. ఇంగ్లిషులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగానికి లోబడి న్యాయబద్ధంగా తీర్పులు వెలువరిస్తామని, హైకోర్టు విధులు నిర్వహిస్తామని జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేశారు. వేదికపై గవర్నర్‌, ప్రధాన న్యాయమూర్తితోపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీనులయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం జస్టిస్‌ రాధాకృష్ణన్‌కు గవర్నర్‌, సీఎంలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం వారు ముగ్గురు వేదిక దిగి కింద ఆశీనులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులతో కరచాలనం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
      అనంతరం హైకోర్టు ప్రాంగణంలోని ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన 12 మంది న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా హాజరయ్యారు. అనేక మంది న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో వచ్చారు
        ప్రధాన న్యాయమూర్తి కాకుండా తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. అయితే ఇప్పుడు 12 మంది మాత్రమే న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టుకు ఉన్నారు.



వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 11:06 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: తీర్పులు, తెలంగాణ రాష్ర్టం

1, జనవరి 2019, మంగళవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు ... హైదరాబాద్ జిందాబాద్

మీకు,  మీ కుటుంబ సభ్యులకు
2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు ...
- కె. వీరయ్య, ఉపాధ్యక్షులు, హైదరాబాద్ జిందాబాద్

వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 6:58 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: శుభాకాంక్షలు, హైదరాబాద్‌ జిందాబాద్‌
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

మీ కోసం ...

  • అభ్యుదయం (18)
  • ఆరోగ్యం (61)
  • ఇతరములు (11)
  • ఎన్నికలు (54)
  • ఒక చిరుదివ్వె... (21)
  • కొన్ని మా జ్ఞాపకాలు (29)
  • క్రీడలు... (14)
  • చిత్రకళ కళ.. (10)
  • తీర్పులు (19)
  • తెలంగాణ రాష్ర్టం (36)
  • దినోత్సవాలు (20)
  • పర్యావరణం (52)
  • బారత దేశం (22)
  • మహా నేతల జన్మదినాలు... వర్ధంతులు... (22)
  • యాత్రలు..పర్యాటక ప్రదేశాలు (37)
  • వింతలు..విచిత్రాలు (10)
  • విజ్ఞానం-విద్యార్థులు (37)
  • వీడియోలు... (2)
  • శుభాకాంక్షలు (44)
  • సమస్యలు (22)
  • సామాజికం... (6)
  • సినీమా... (2)
  • హైదరాబాద్‌ జిందాబాద్‌ (74)
  • హైదరాబాద్.. (45)
  • LIC (8)

నలుగురు మెచ్చినవి...

  • మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు...
  • మిత్రులందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు...
  • 55ఏళ్ల వ్యక్తితో 16ఏళ్ల యువతి పెళ్లి ....?
  • ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు....

మొత్తం వీక్షణలు

Flag Counter

counters

నా గురించి

నా ఫోటో
వీరయ్య కె
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

బ్లాగు ఆర్కైవ్

  • ►  2021 (3)
    • అక్టోబర్ (1)
    • ఏప్రిల్ (1)
    • మార్చి (1)
  • ►  2020 (51)
    • డిసెంబర్ (1)
    • ఆగస్టు (7)
    • జులై (3)
    • జూన్ (1)
    • మే (10)
    • ఏప్రిల్ (6)
    • మార్చి (13)
    • ఫిబ్రవరి (6)
    • జనవరి (4)
  • ▼  2019 (68)
    • డిసెంబర్ (4)
    • నవంబర్ (3)
    • అక్టోబర్ (2)
    • సెప్టెంబర్ (5)
    • ఆగస్టు (8)
    • జులై (3)
    • జూన్ (7)
    • మే (5)
    • ఏప్రిల్ (9)
    • మార్చి (12)
    • ఫిబ్రవరి (2)
    • జనవరి (8)
  • ►  2018 (70)
    • డిసెంబర్ (11)
    • నవంబర్ (11)
    • అక్టోబర్ (4)
    • సెప్టెంబర్ (13)
    • ఆగస్టు (7)
    • జులై (7)
    • జూన్ (5)
    • మే (3)
    • ఏప్రిల్ (3)
    • జనవరి (6)
  • ►  2017 (30)
    • డిసెంబర్ (4)
    • నవంబర్ (4)
    • అక్టోబర్ (7)
    • సెప్టెంబర్ (7)
    • ఆగస్టు (4)
    • జులై (2)
    • జనవరి (2)
  • ►  2016 (43)
    • అక్టోబర్ (2)
    • సెప్టెంబర్ (9)
    • ఆగస్టు (5)
    • జులై (4)
    • జూన్ (5)
    • మే (2)
    • ఏప్రిల్ (9)
    • మార్చి (2)
    • ఫిబ్రవరి (5)
  • ►  2015 (15)
    • నవంబర్ (1)
    • అక్టోబర్ (6)
    • సెప్టెంబర్ (2)
    • ఆగస్టు (3)
    • జూన్ (2)
    • మే (1)
  • ►  2014 (71)
    • నవంబర్ (1)
    • అక్టోబర్ (12)
    • సెప్టెంబర్ (2)
    • ఆగస్టు (5)
    • జులై (9)
    • జూన్ (9)
    • మే (11)
    • ఏప్రిల్ (8)
    • మార్చి (6)
    • ఫిబ్రవరి (4)
    • జనవరి (4)
  • ►  2013 (55)
    • డిసెంబర్ (7)
    • నవంబర్ (4)
    • అక్టోబర్ (6)
    • సెప్టెంబర్ (14)
    • ఆగస్టు (19)
    • జులై (5)
  • ►  2011 (64)
    • డిసెంబర్ (1)
    • నవంబర్ (2)
    • అక్టోబర్ (2)
    • సెప్టెంబర్ (4)
    • ఆగస్టు (8)
    • జులై (8)
    • జూన్ (7)
    • మే (18)
    • ఏప్రిల్ (14)
సమూహము: Telugu Blogs
శోధిని
కూడలి
లేఖిని (lekhini): type in telugu
poodanda


మాలిక: Telugu Blogs
సాధారణ థీమ్. caracterdesign ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.