10, జనవరి 2019, గురువారం

జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో బంగారు పతకాలను సాధించిన వారిని సన్మానించింది....

జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో విశేష ప్రతిభ ప్రదర్శించి బంగారు పతకాలను సాధించిన కుమారి రహమతున్నీసా బేగం, సాయిలలిత్‌ కుమార్‌లను హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ఈ రోజు (10.01.2019) ప్రెస్‌క్లబ్‌లో సన్మానించింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిహెచ్‌ఎంసి స్పోర్ట్స్‌ ఓ.ఎస్‌.డి. డా|| ఎస్‌.ఆర్‌.ప్రేమ్‌రాజ్‌గారు, టిఎస్‌ఆర్‌టిసి సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ శ్రీ జి.ఆర్‌. కిరణ్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీ పాశం యాదగిరి హాజరై ప్రసంగించారు. గోల్డ్‌మెడల్‌ సాధించిన యువ క్రీడాకారులకు, వారికి శిక్షణ నిచ్చిన కోచ్‌లు శ్రీ గంగరాజు, శ్రీ సుమిత్‌లను శాలువా కప్పి సత్కరించారు.
జిహెచ్‌ఎంసి స్పోర్ట్స్‌ ఓ.ఎస్‌.డి. డా|| ప్రేమ్‌రాజ్‌ గారు మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరానికి చెందిన విద్యార్ధులు ఆర్చరీ, వెయిట్‌ లిఫ్టింగ్‌లలో గోల్డ్‌ మెడల్స్‌ సాధించటం హర్షనీయమని, వారికి ప్రోత్సాహమిచ్చిన తల్లిదండ్రులను, పట్టుదలతో శిక్షణనిచ్చిన కోచ్‌లను అభినందించారు. టిఎస్‌ఆర్‌టిసి సీనియర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌ శ్రీ జి.ఆర్‌. కిరణ్‌ మాట్లాడుతూ తాను వాల్‌బాల్‌ జాతీయ జట్టులో ఆడానని, క్రీడలలో ప్రవేశం కారణంగానే తానీస్థితిలో ఉన్నానని, విద్యార్ధులు, యువజనులందరూ తమ దిన చర్యలో క్రీడలను భాగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థ క్రీడాకారులను అభినందిస్తూ మంచి కృషి చేస్తున్నదని అన్నారు. రహమతున్నీసా బేగం జాతీయ స్థాయిలో 4 గోల్డ్‌ మెడల్స్‌ సాధించటం అభినందనీయమని ఆమె విజయంలో కోచ్‌ గంగరాజుగారిని వెయిట్‌ లిఫ్టింగ్‌లో సాయిలలిత్‌ కుమార్‌కు శిక్షణ నిచ్చిన సుమిత్‌ను అభినందించారు.


ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, టిఎన్‌వి రమణ, జె.కె.శ్రీనివాస్‌, పి.మోహన్‌లు నాయకత్వం వహించారు. కార్యక్రమానికి గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన యువ క్రీడాకారుల పేరెంట్స్‌ ఎస్‌.నిస్సార్‌ అహ్మద్‌, వి.సత్యనారాయణలు హాజరైనారు.
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి