తెలంగాణ హైకోర్టు షురూ
- తొలి సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణం
- తొమ్మిది మంది న్యాయమూర్తులు కూడా
- కొత్త చరిత్రకు శ్రీకారం
తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేత తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహ న్ ప్రమాణం చేయించారు. ఇంగ్లిషులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. రాజ్యాంగానికి లోబడి న్యాయబద్ధంగా తీర్పులు వెలువరిస్తామని, హైకోర్టు విధులు నిర్వహిస్తామని జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. వేదికపై గవర్నర్, ప్రధాన న్యాయమూర్తితోపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీనులయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం జస్టిస్ రాధాకృష్ణన్‌కు గవర్నర్, సీఎంలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం వారు ముగ్గురు వేదిక దిగి కింద ఆశీనులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులతో కరచాలనం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
అనంతరం హైకోర్టు ప్రాంగణంలోని ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన 12 మంది న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా హాజరయ్యారు. అనేక మంది న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో వచ్చారు
ప్రధాన న్యాయమూర్తి కాకుండా తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. అయితే ఇప్పుడు 12 మంది మాత్రమే న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టుకు ఉన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి