హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ''స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్'' కల్చరల్ ఫెస్ట్ ప్రచార పోస్టర్‌ను ఈ రోజు (29.01.2019) టూరిజం, కల్చరల్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారు సచివాలయం మీడియా పాయింట్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఒక మినీ భారత్. అన్ని రాష్ట్రాల ప్రజానీకం ఈ నగరంలో నివాసముంటున్నారని అన్నారు. హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్, లిటరరీ ఫెస్ట్, బుక్ ఫెయిర్ లాంటివి జయప్రదంగా నిర్వహించామని, కల్చరల్ ఫెస్ట్ ఇవన్నీ వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రదర్శిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను దర్శిస్తే దేశంలో అన్ని రాష్ట్రాల సంస్కృతులను చూడొచ్చని, హైదరాబాద్ ఒక టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ఫిబ్రవరి 3 వ తేదీ న హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో కల్చరల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారని, అందులో బెంగాల్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 8 రాష్ట్రాల సంస్కృతులు ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు ఉంటాయని, దీనిద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేలా కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని, నగర ప్రజానీకం వీటిని తిలకించి జయప్రదం చెయ్యాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు పాశం యాదగిరి, కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎన్.సంజీవరెడ్డి, కె.వీరయ్య, ఎ.ఎ.కె.అమీన్ లు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి