7, ఏప్రిల్ 2020, మంగళవారం

ప్రజా ఆరోగ్యమే మొద్దటి ఎజెండా...

ప్రపంచ మానవాళిని గజగజ వణికిస్తూన్న బయంకర మహామ్మారి కరోనా.
ఇప్పటికే దాదాపు 75 వేల మందిని పోట్టన పెట్టుకోగా, దాదాపు 13.5 లక్షల మంది బారిన పడ్డారు.
 కరోనాపై ప్రపంచమే యుద్దం చేస్తున్న తరుణంలో ప్రపంచ చరిత్రలో నేడు ముఖ్యమైన రోజు. 
నేడు 07.04.2020 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. చాలా విశిష్టిత కలిగినది. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, శాస్త్రవేత్తలు కరోనాపై చేస్తూన్న పోరాటంలో నిజమైన దేవుళ్ళు. మానవత్వం ముందు మరేది నిలవలేక పోయింది. గెలువలేక పోయింది. ఇది ఎన్నో చరిత్రలు చెప్పిన సత్యం.

ఇపుడు మనుషులు జీవించాలంటే ఏమి చేయాలి? ఏమి నేర్చుకోవాలి ?
ప్రకృతి పట్ల, తోటి జీవరాశుల పట్ల ప్రవర్తన ఏలా వుండాలి ?
భవిష్యత్‌ కోసం ప్రభుత్వాలు ఏమి ఆలోచిస్తున్నాయి ?
రాజకీయ నాయకులు ఏం చేపుతున్నారు ?
శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఏమి స్పందిస్తున్నారు ?
ఇలా ప్రజల ముందు భవిష్యత్‌ గురించి ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు...?

కరోనా లాంటి మహామ్మారులకు ధనిక, పేద, కులం, మతం, తక్కువ,
ఎక్కువ, ఈ దేశం, ఆదేశం...అనే భావం లేకుండా భూమిపై జీవించే
జీవరాసులన్నింటిని సమానంగా చూస్తాయి. ప్రస్తూత పరిస్థితులను చూసి అయిన భవిష్యత్‌లో ప్రజా ఆరోగ్యం ప్రపంచ దేశాల మొద్దటి ఎజెండా గా వుండాలి. ఆరోగ్యంపై అన్ని దేశాలు పర్సపర సహకరాలు ఇచ్చిపుచ్చుకునే విదంగా వుండాలి. ఇపుడు వున్న లోపాలను సవరించుకోని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మహామ్మారులపై నిత్యం శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన పరిశోధనలు చేయడంలో గణనీయంగా పెరగాలి. ప్రభుత్వాలే ఆరోగ్య ఆసుపత్రులను నెలకొల్పి, అభివృద్ది చేయాలి. వైద్యులను, వైద్య సిబ్బందిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా పెంచుకోవాలి. అభివృద్ది చేసుకోవాలి. ఈ లాంటి మహామ్మారులు ఏన్ని వచ్చిన యుద్దానికి స్థిదంగా వుండాలి. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణానికి నష్టం కలిగించకుండా ప్రకృతిలో కలిసి జీవించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి