28, డిసెంబర్ 2019, శనివారం

ఉచిత దుప్పట్ల పంపిణి

సినియర్ సిటిజన్స్‌ ఫోరం, హైదరాబాద్‌ జిందాబాద్‌ నల్లకుంట ఏరియా కమిటీల ఆధ్వర్యంలో నేడు పాత రామాలయం వద్ద యాచకులకు, నిరాశ్రయులకు దుప్పట్ల ఉచిత పంపిణి కార్యక్రమం జరిగింది.
సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షులు మోహన్‌ రావు గారు, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య గారు, కోశాధికారి నర్సింహామూర్తి గారు, సత్యానారాయణ గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు డా|| జయాసూర్య, వీరయ్య, శ్రీనివాస్‌, మోహన్‌ స్థానిక నాయకులు చంద్రశేఖర్‌, సోమేష్‌, శ్రీకాంత్‌, ప్రసాద్‌ , నాయుడు తదితరులు పాల్గొన్నారు.





25, డిసెంబర్ 2019, బుధవారం

క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు...

మీకు
మీ కుటుంబ సభ్యులకు  
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు..... వీరయ్య


7, డిసెంబర్ 2019, శనివారం

ఎన్‌కౌంటర్‌...

- తెల్లవారుజామునే కాల్చిచంపిన పోలీసులు
- నలుగురూ అక్కడికక్కడే మృతి
- ఘటనాస్థలికి భారీగా జనం
- పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- ఆ శవాలను భద్రపర్చండి : హైకోర్టు
- దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. 
ఆగ్రహావేశాలను రగిల్చిన 'దిశ' ఘటన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ చటాన్‌పల్లిలో శుక్రవారం 6.12.19 తెల్లవారు జామున సైబరాబాద్‌ పోలీసులు జరిపిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురూ అక్కడికక్కడే మృతిచెందారు. నిందితుల రిమాండ్‌, పోలీసు కస్టడీ, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు.. నేపథ్యంలో కఠిన శిక్ష పడుతుందనుకుంటున్న సమయంలో ఎన్‌కౌంటర్‌ చేయడం యావత్‌ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది.

 






4, డిసెంబర్ 2019, బుధవారం

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం...

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 
01-12-2019 న జరిగింది. డా|| ఎం.ఉపేందర్‌ రెడ్డి గారు, 
డా|| వై.ఎం.ఎం.రాజు గారు, డా|| బి.వేణుగోపాల్‌ గారు, 
డా|| ఆర్‌.రవి గారు పాల్గొని ఈ వైద్య శిబిరంలో ఉచిత సేవలందించారు. 
 ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.30 గం||ల వరకు జరుగుతుంది.
 మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.