26, మే 2018, శనివారం

నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు మరమ్మతులు చేయాలని ...Hyderabad zindabad

              నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం లైన్‌లో నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, నాలా పూడిక తీయాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. భారీ వాహనాలు రాకుండా ఐరన్‌ కమాన్‌ ఏర్పాటు చేయాలని '' నల్లకుంట పాత రామాలయం లైన్‌ రిస్సిడెట్స్‌ అసోషియేషన్‌ '' తరపున ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
          ఈ కార్యక్రమంలో లో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఉపాధ్యక్షులు కె. వీరయ్య, '' నల్లకుంట పాత రామాలయం లైన్‌ రిస్సిడెట్స్‌ అసోషియేషన్‌ '' ఉపాధ్యక్షులు బి. బాలకృష్ణ రెడ్డి (అడ్వకేట్‌ ) , సహాయ కార్యదర్శి బి. అజరుకుమార్‌ రెడ్డి , ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గడ్డం వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.





1 కామెంట్‌: