20, మే 2018, ఆదివారం

మ్యాన్‌ హోల్స్‌కు మరమ్మతులు... Hyderabad zindabad

నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో ఎస్‌బిఐ బ్యాంక్‌ - క్షత్రియా టవర్స్‌ లైన్‌లో పగిలిపోయి, కూలిపోవడానికి సిద్ధంగా వున్న మ్యాన్‌ హోల్స్‌కు మరమ్మతులు చేశారు. '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో చాల సార్లు కంప్లయింట్స్‌ చేయడంతో నేడు జిహెచ్‌ఎంసి ఏఇ ఉపేందర్‌ గారు సందర్శించి ప్రమాదకరంగా మ్యాన్‌ హోల్‌ మరమ్మతులు చేయించి, కొన్ని కవర్‌లు మార్చారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' నగర ఉపాధ్యక్షులు కె. వీరయ్య, సీనియర్‌ సిటిజన్‌ నాయకులు డి. రామకృష్ణరావు, కృష్ణబాబు, స్థానిక నాయకులు అజరుకుమార్‌ రెడ్డి, డి. మోహన్‌, పి. శ్రీనివాస్‌, సునిల్‌ తదితరులు పాల్గొన్నారు.





4 కామెంట్‌లు: