12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ సాగర్ కన్నుమూత


 సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కవి అరుణ్ సాగర్ కన్నుమూశారు.
 కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుత్రిలో చికిత్స 
పొందుతూ హైదరాబాద్ లో శుక్రవారం మృతి చెందారు.
 అరుణ్ సాగర్ ఆంధ్రయూనివర్సిటీలో ఎంఏ చేశారు.
 తెలుగు పత్రికలతో పాటూ వివిధ టీవీ చానళ్లలో ఆయన పని చేశారు.
 ప్రసుత్తం  టీవీ5 ఎడిటర్. 
సామాజిక స్పృహ బాగా ఉన్న కవి... అన్నింటికీ మించి... మంచి మనిషి.
 నవ కవిత్వం.. ఆగింది...    వారి అకాల మరణం..  
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. 



5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చరిత్ర తిరగరాసింది. గతంలో ఏ పార్టీ కూడా  జంట నగరాల ప్రజలు ఇన్ని స్థానాలు ఇచ్చి అద్భుత విజయాన్ని అందించలేదు. హైదరాబాద్ నగర చరిత్ర చూసినా... ఏ ఒక్క పార్టీ నేరుగా జీహెచ్ఎంసీలో అధికారం చేపట్టిన చరిత్ర లేదు. 
    5 ఫిబ్రవరి 2016, ఈప్పటివరుకు వచ్చిన సమాచారం   టీఆర్ఎస్‌ పార్టీ 98 గెలిచింది, 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ/ బీజేపీ 4 గెలిచింది.
ఎంఐఎం 37 గెలిచింది, 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  కాంగ్రెస్ 1 గెలిచింది, 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  మొత్తం డివిజన్లు 150.

4, ఫిబ్రవరి 2016, గురువారం

డివిజన్ వారిగా పోలింగ్ వివరాలు...

గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)
ఫిబ్రవరి 2016 ఎన్నికల పోలింగ్ వివరాలు



3, ఫిబ్రవరి 2016, బుధవారం

ఆలోచించండి...

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోరు ఫిబ్రవరి 2 తో  ముగిసింది.  కొత్త రాష్ట్రం..కొత్త ఉత్సాహం..అయినా గ్రేటర్‌ ఎన్నికలలో పోలింగ్‌ 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఓటరన్నలో నిర్లిప్తత..నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామంటూ పాలకపార్టీ నేతలు గల్లీగల్లీ తిరిగినా..పోలింగ్‌ శాతం ఆశించినరీతిలో పెరగలేదు. ప్రత్యర్థి పార్టీలు ఇచ్చిన హామీలు కూడా పోలింగ్‌ కేంద్రాలవైపు ఓటర్లను మళ్లించలేకపోయాయి.