అంతర్జాతీయ విమాన ప్రదర్శనను చూడ్డానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. బేగంపేట్ ( హైదరాబాద్) విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. ఈనెల 12-16 వరకు (మార్చి 2014) నిర్వహించిన ఇండియన్ ఏవీయేషన్-2014లో భాగంగా ఎయిర్ షోను తిలకించడానికి శనివారం సాధారణ జనానికి అనుమతించడంతో పిల్లపాపలతో భారీగా వచ్చారు. ఏవీయేషన్ షో తిలకించడానికి ఆశగా వచ్చిన జనం విన్యాసాలతో సరిపెట్టుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద విమానమైన ఎయిర్‌బస్ వెళ్లిపోవడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇతర విమానాలు కూబి ఎక్కువగా కనిపించలేదు.
ఒక్కొక్కరికి టికెట్ రూ.300 వసూలు చేశారు. పిల్లలకు సైతం టికెట్ పెట్టారు. వచ్చిన జనం కూర్చుకోవడానికి కనీసం కుర్చీవేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు విమానాలను చూడ్డానికి అనుమతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏదీ తిందామన్నా.. రూ.100కుపైనే.. ఎయిర్‌షోను చూడ్డానికొచ్చిన జనాన్ని నిలువున దోచుకున్నారు. వెజ్ ఫ్రైడ్‌రైస్, నూడిల్స్, చికెన్‌రైస్, చపాతి ప్లేట్‌కు రూ.120 వసూలు చేస్తున్నారు. తాగడానికి నీళ్లు కూడాలేవు. నీళ్లు తప్ప ఏదీ తక్కువ లేదు. అలరించిన విన్యాసాలు.. జెట్ విమానాల విన్యాసాలు అలరించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి