8, మార్చి 2014, శనివారం

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..

పార్టీ ఎంచుకున్న రాజకీయ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ప్రజలకు ఎన్నో విధాలా మేలు జరుగుతుందని పాలక వర్గాలు పేర్కొన్నాయన్నారు. వీటిని ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మారని తెలిపారు. రాబోయే కాలంలో పాలకవర్గాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని పోరాటం సాగిస్తామన్నారు. అదేవిధంగా విభజన సమయంలో తెలంగాణ ప్రాంతంలో పార్టీకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, అయినప్పటికీ.. పార్టీ వాటన్నింటినీ తట్టుకుందని తెలిపారు. దీనికి కారణం కార్యకర్తల్లో ఉన్న క్రమశిక్షణ, ఐక్యతే కారణమని, దాన్ని కాపాడుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అంతిమంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం , వారి ఆంకాంక్షలను నెరవేర్చడం కోసం ఉద్యమాలను రూపొందిస్తామని పేర్కొన్నారు.

       ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు

      రాష్ట్ర విభజన నేపథ్యంలో సీపీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం కీలక సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీతారం ఏచూరీ, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధును నియమించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కమిటీలు నియమించింది మొట్టమొదటి పార్టీ సీపీఎం అని చెప్పవచ్చు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి