28, డిసెంబర్ 2013, శనివారం

రైల్లో ఘోర అగ్ని ప్రమాదం...

   నాందేడ్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ లో 28.12.2013(శనివారం) తెల్లవారుజామున 3.10 గంటల సమయంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 23 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. ప్రమాదంలో బి-1 ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో మంటలు వ్యాపించాయి. రైల్లోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీ బోగీ బి వన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బోగీలోని వారందరూ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.

         ఈ విషయాన్ని గమనించిన అధికారులు రైలును పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆపివేసి ఏసీ బోగీల లింక్ ను తొలగించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మంటలు రెండో బోగీకి వ్యాపించాయి. ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. రెండు బోగీల్లో 72 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన 15 మంది మృత దేహాలను వెలుపలికి తీశారు.
రైలు ప్రమాద హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు- బెంగళూరు: 080-22354108, 22251271, 22156554, 22156553
పుట్టపర్తి ప్రశాంతి నిలయం : 08555-280125


21, డిసెంబర్ 2013, శనివారం

famous stepwell...

      Chand Baori is a famous stepwell situated in the village Abhaneri near Jaipur in Indian state of Rajasthan. This step well is located opposite Harshat Mata Temple and is one of the deepest and largest step wells in India. It was built in 9th century and has 3500 narrow steps and 13 stories and is 100 feet deep. It is a fine example of the architectural excellence prevalent in the past.








12, డిసెంబర్ 2013, గురువారం

ప్రకృతి అందాలతో అలరాకే చిత్తూరు...

                 ఆంధ్రప్రదేశ్‌లో అతి పొడవైన పర్వతశ్రేణులంటే గుర్తొచ్చేది తూర్పు కనుమలే. ఇవి చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు నుంచి ప్రారంభమవుతాయి. చిత్తూరు జిల్లాలో దట్టమైన అడవి, పచ్చటి చెట్లు ఉన్న కొండలపైన తిరుమల క్షేత్రం, పర్వత పాదభాగంలో తిరుపతి నగరం ఉన్నాయి. కింద తిరుపతి నుండి పైకి చూస్తే, ఏడుకొండల శ్రేణి... మహా సర్పంలా, తిరుమల ప్రాంతం... పడగలా కన్పిస్తుంది. భారతదేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి అగ్రస్థానంలో ఉంది. చుట్టుపక్కల ఉన్న సహజ మానవ నిర్మిత ఆకర్షణలతో చక్కటి యాత్రాస్థలంగా, సెలవు కాలపు నెలవుగా విరాజిల్లుతోంది. ఏడుకొండల ఘాట్‌ రోడ్డులో ప్రయాణ అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. 
       తిరుమల దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తండోప తండాలుగా తరలివస్తారు. ఈ ఆలయం గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విశేషాలను ప్రస్తావించారు. తిరుమల ఆలయానికి మహరాజ పోషకులుగా పల్లవులు, పాండ్యులు, చోళులు, విజయనగర పాలకులు, మైసూరు మహారాజులు చరిత్రకెక్కారు.
             తిరుమల ప్రధాన ఆలయం ప్రాచీన భారతీయ శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. గర్భగుడిపై ఉండే విమానం, ధ్వజస్థంభం పైపొరలు బంగారు తాపడంతో చేసినవి. 

5, డిసెంబర్ 2013, గురువారం

10 జిల్లాల తెలంగాణకే కేబినెట్ ఆమోద ముద్ర

 తెలంగాణ బిల్లుపై ఉత్కంఠకు దాదాపుగా తెర పడింది. 10 జిల్లాల తెలంగాణకే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రేటర్ హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. జీవోఎం తయారు చేసిన బిల్లు ముసాయిదాను కేబినెట్ సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించినట్లు హోంమంత్రి షిండే అధికారికంగా ప్రకటించారు. అన్ని వర్గాలను సంప్రతించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. 

3, డిసెంబర్ 2013, మంగళవారం

పాలమూరు పాపికొండలు...

పాపికొండలంటే గుర్తొచ్చేది గోదారమ్మే!
కానీ... అంతే స్థాయిలో కృష్ణమ్మ పొదువుకున్న సింగారాలున్నాయి !
ఎత్తయిన కొండల మధ్య... కృష్ణమ్మకు పచ్చని పట్టు చీరె కట్టినట్లుండే దుర్గమారణ్యం నడుమ...
 ప్రకృతి కుంచె దిద్దితీర్చిన ఓ అద్భుత చిత్తరువు... 
వంద కిలోమీటర్ల పొడవునా మెరిసిపోతూ మురిసిపోతుంటుంది!
పడవెక్కి బయల్దేరితే... ఆప్యాయంగా పలకరిస్తుంటుంది !
మొన్నటి దాకా పోలీసులు, మావోయిస్టుల తుపాకులు పలకరించుకున్న ప్రాంతం... 
ఇప్పుడు జాలర్లు హైలెస్సా అంటూ పాడే పాటలకు మౌనంగా గొంతుకలుపుతున్నది !
అసలు అంతటి అద్భుత ప్రాంతం  కృష్ణమ్మకు సొంతమని చాలా తక్కువ మందికే తెలుసు!
అక్కడికి వెళ్ళేవారెవరు ? ఆ అందాలు వెలికి తీసి... బయట ప్రపంచానికి చాటేదెవరు ?
 నమస్తే తెలంగాణ పత్రిక ప్రయత్నం చేసింది! బాధ్యత తీసుకుంది!
భావి తెలంగాణలో మరో అద్భుత పర్యాటక ప్రాంతమయ్యేందుకు సకల అర్హతలూ ఉన్న ఒక ప్రకృతి నిలయాన్ని అత్యంత సాహసానికోర్చి... కన్నులారా చూసింది!
తన కళ్లతో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది !! 
               ఎవరా ప్రకృతి రమణి ?         ఎక్కడుందా రమణీయ కాంతి ? 


హైదరాబాద్‌ నుండి దాదాపు 170 కి.మీ. దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుండి మరో 8 కి.మీ. ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి.