అన్నా దీక్ష విరమణ...
ఇది ప్రజా విజయం... అహింసా ఉద్యమ స్ఫూర్తి కొనసాగిద్దాం - అన్నా హజారే
పండుగ వాతావరణం నెలకొన్న రాంలీలా మైదానంలో, ఆనంద ఉత్సాహాలతో పరుగులు తీస్తూ వచ్చిన వేలాది ప్రజాస్వామిక ప్రేమికుల సమక్షంలో అన్నా హజారే ఆదివారం ఉదయం 12 రోజుల దీక్ష విరమించారు. ఐదేళ్ల చిన్నారులు సిమ్రన్, ఇక్రా కొబ్బరినీళ్లు ఇవ్వడంతో అన్నా దీక్ష విరమించారు. అనంతరం అహింసా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దామని అన్నా ప్రజలకు పిలుపునిచ్చారు.

పౌర సమాజం చేసిన డిమాండ్లలను ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదించడం ప్రజా ఘన విజయమని అన్నా వ్యాఖ్యానించారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన అశేష జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ త్వరలోనే అవినీతి రహిత దేశంగా మారగలదని ఉత్సాహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సాధించినది సగం విజయమేనంటూ దేశ ఎన్నికల నిర్వహణ వ్యవస్థలోనూ, విద్యారంగ వ్యవస్థలోనూ ఎన్నో సంస్కరణలు రావల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. అన్నా ఉద్యమం ఇంతటితో ఆగిపోయేది కాదంటూ అవినీతిపరులైన ప్రజా ప్రతినిధులను చట్ట సభలనుంచి వెనుకకు తీసుకురావాలని అన్నారు. విద్యా రంగం ధనార్జనకు వేదికగా మారిపోయిందని అందువల్ల విద్యా వవస్థలో ఎన్నో సంస్కరణలు రావాల్సి ఉందని అన్నా పిలుపునిచ్చారు.
దీక్ష విరమించిన అనంతరం అన్నాను చికిత్స కోసం తిన్నగా మేధాంత మెడిసిటీకి తీసుకువెళ్లారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సంబరాలు చేసుకుందాం రమ్మని ప్రజలకు కేజ్రీ వాల్ పిలుపునిచ్చారు.
( ఆంధ్రజ్యోతి ,ఈనాడు పత్రిక సౌజన్యం తో... )