సినిమాలో వేసేది విలన్ పాత్రలు. బయట మాత్రం ఆయన రియల్ హీరో.
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించినప్పుడు ఎక్కడివారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు, డబ్బులు, తినడానికి తిండి అన్ని ఉన్నవారి పరిస్థితి ఆ టైంలో బాగానే ఉంది. కానీ పొట్టకూటి కోసం అయిన వారందరిని వదిలి ఎవరూ తెలియని చోటుకు వచ్చి బతికే వలస కూలీల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది.
ప్రభుత్వం అందించే సాయం అందకా, రైళ్లు,బస్సులు లేక సొంత గూటికి చేరలేక, ఉన్నచోట తినడానికి తిండి, ఉండటానికి నీడలేక వారు పడిన బాధలు వర్ణనాతీతం. అలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి ఆ విలన్ హీరోలా ముందుకు వచ్చాడు.
సినిమాలో హీరోలం అని చెప్పుకునే చాలా మంది చెయ్యలేని పనిని చేశాడు. రియల్ హీరో అని నిరూపించుకున్నాడు. మమల్ని ఎవరు ఆదుకుంటారా అని వలస కార్మికులందరూ ఎదురు చూస్తున్న క్రమంలో సోనూ సూద్ నేనున్నాను అంటూ వారిని సొంత గూటికి చేర్చాడు. వాళ్లందరిని బస్సులు, రైళ్లు ద్వారా అయినవారి చెంతకు చేర్చాడు. అప్పటి నుంచి ఎవరు ఏ సాయం అడిగిన అందిస్తూనే ఉన్నాడు.
అక్కడి వారు, ఇక్కడి వారు అనే తేడా లేదు. ఎవరు కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆయన ముందుకు వస్తున్నాడు.
మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి తన మానవత్వాన్ని మరోమారు చాటుకున్నాడు.
కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు సోనూ సూద్. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సోనూ సూద్. తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు సోనూ సూద్. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన అనుపమ్ శ్యామ్‌కు సాయం చేస్తానని ట్విటర్ వేదికగా వెల్లడించారు సోనూ సూద్.
....నిత్య జీవితంలో రియల్ హీరో,
మానవత్వం, సేవాగుణం కలవారు
సోనూ సూద్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి