# బ్లడ్ ప్లాస్మా అంటే ఏమిటి..?
* రక్తపు రసి ( Blood plasma - బ్లడ్ ప్లాస్మా, రక్తరసము, నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం) అనేది తేటైన ఎండుగడ్డి రంగు గల రక్తం యొక్క ద్రవ భాగం, ఇది రక్తం నుండి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్, ఇతర సెల్యూలర్ భాగాలు తొలగించబడిన తరువాత మిగిలిన భాగం. ఇది మానవ రక్తం యొక్క ఒక పెద్ద భాగం, రక్తంలో దాదాపు 55 శాతం దాకా వుంటుంది, నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి వుంటుంది. ప్లాస్మా 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక మాధ్యమం. ప్లాస్మా శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను ఎదుర్కోవడం, వివిధ ఇతర క్లిష్టమైన విధులను చేపడుతోంది.*
* 👉 # ప్లాస్మాథెరపీఅంటే_ఏంటి?*
* రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అందుకే, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది.*
* అయితే, కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.*
* అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు..*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి