28, నవంబర్ 2019, గురువారం

ఉచిత కంటి అద్దాల పంపిణీ...

హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో 
ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం 
28.11.2019 శ్రీ విశ్వభారతి పాఠశాల,రసూల్ పుర లో జరిగింది.
ప్రముఖ హర్ట్ సర్జన్ డాక్టర్ దాసరి ప్రసాద రావు గారు,
హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు
పాల్గొన్నారు.


26, నవంబర్ 2019, మంగళవారం

అందర్నీ ఒకేసారి చంపేయండి...

- కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం...
- గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశం...
దేశ రాజధానిలో వాతావరణ కాలుష్యం, తాగునీటి నాణ్యతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 'పరిస్థితులు దారుణంగా ఉంటే... కాలుష్యానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఢిల్లీలో పరిస్థితి నరకం కంటే భయంకరంగా ఉన్నది. వారిని బలవంతంగా గ్యాస్‌ ఛాంబర్‌లో ఎందుకు ఉంచాలనుకుంటున్నారు? మనుషుల ప్రాణాలకు మీరిచ్చే విలువ ఇదేనా? అంతకంటే ఓ 15 బ్యాగుల పేలుడు పదార్థాలు తెచ్చి అందర్నీ ఒకేసారి చంపేయండి...' అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు తమ మధ్య వున్న విభేదాలను పక్కనబెట్టి కాలుష్య నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లోగా ప్రణాళికలను రూపొందంచాలని స్పష్టం చేసింది. ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

25, నవంబర్ 2019, సోమవారం

చెట్లు నరికివేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని...

నగరంలో చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని , 
చెట్లు నరికివేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని,
'' హైదరాబాద్‌ జిందాబాద్‌ ''గా డిమాండ్‌ చేస్తు నేడు (25.11.2019)
 '' ప్రజావాణి '' జిహెచ్‌ఎంసి, హెడ్‌ ఆఫీసు లో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
 వెంటనే చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు.



బాగ్‌లింగంపల్లి హౌజింగ్‌ బోర్డ్‌ కాలనీ ఎంఐజి-2, బ్లాక్‌ 18 వద్ద మరియు నల్లకుంట కూరగాయాల మార్కెట్‌ రోడ్‌లో చెట్లు నరికివేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, నగరంలో చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని 
'' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' గా డిమాండ్‌ చేస్తున్నాము. 
''హైదరాబాద్‌ జిందాబాద్‌'' ప్రతినిథి బృందం గత నెల 29న జిహెచ్‌ఎంసి అడిషనల్‌ కమిషనర్‌ వి. కృష్ణ గారిని కలిసి పుట్‌పాత్‌పై వున్న చెట్లను కొట్టివేశారని, ఇది అక్రమమని విన్నవించారు. చెట్ల కొట్టివేత అనుమతి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మిగిలిన చెట్లను కాపాడుతామని, మూడవ చెట్టు అయిన వేప చెట్టును కొట్టి వేతను నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. ఇపుడు ఉన్న స్థితిని కొనసాగిస్తూ, భవిష్యత్‌లో ఉన్న చెట్లకు ఒక చిన్న కొమ్మ తెగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ మరల 23.11.2019న అర్థరాత్రి ఒక చెట్టు మొదలు కూడా కొట్టినారు.
బాగ్‌లింగంపల్లి హౌజింగ్‌ బోర్డ్‌ కాలనీ ఎంఐజి-2, బ్లాక్‌ 18, ప్లాట్‌ 3 వద్ద తేది. 28.10.2019న 35 సం||ల వయస్సు కలిగిన రెండు చెట్లను నరికివేశారు. మూడవది వేప చెట్టును కూడా కొటివేయడం ప్రారంభించడంతో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' సంస్థగా మేము మరియు స్థానిక కాలనీ వాసులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. 
నల్లకుంట కూరగాయాల మార్కెట్‌ రోడ్‌లోని క్షత్రియ టవర్స్‌ ప్రక్కల దాదాపు 30 సంవత్సరాల చెట్టును జిహెచ్‌ఎంసి అధికారులు నెల రోజుల క్రితం నరికివేశారు. ఇది షాప్‌కు దాదాపు 10 అడుగుల దూరంలో రోడ్డు ప్రక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్టు. షాప్‌ కనపడటం లేదని, భవనానికి కొమ్మలు తగులుతున్నాయని చెప్పి భారీ చెట్టును కొట్టివేసినారు. 
పుట్‌పాత్‌లను ఆక్రమించుకుంటున్న , సెట్‌బ్యాక్‌లను ఆక్రమించుకుంటున్న సందర్భలలో అరికట్టావలసిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటి యాజమానులు చెప్పే సమస్యలను చూపుతూ రోడ్డుపై ఉన్న 30-35 సంవత్సరాల చెట్లను ప్రభుత్వ అధికారులే నరికివేయడం చాల దారుణమైన చర్య. 
''హరితహారం'' పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది మొక్కలను నాటుతూ చెట్లు పెంచాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతుంటే మరొక వైపు పుట్‌పాత్‌ పై వున్న చెట్లను ప్రభుత్వ అధికారులే ఏలా కొట్టివేస్తారు? 35 సం||ల పెద్ద చెట్ల నరికి వేతకు జిహెచ్‌ఎంసి, అటవి శాఖ వారు ఏలా పర్మిషన్‌ ఇచ్చారు? మొక్కలు నాటి, వాటిని కాపాడవలసిన ప్రభుత్వ అధికారులే చెట్లను నరికివేయటం ఎంత అన్యాయం. ఎంత దారుణం.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రావు గారు, సహయ కార్యదర్శి విజరుకుమార్‌, ఉపాధ్యక్షులు వీరయ్య, రమణ, నాయకులు శ్రీనివాస్‌్‌, రాములు తదితరులు పాల్గొంన్నారు.