4, జులై 2019, గురువారం

కొత్త సేవలు ప్రారంభించిన ఎల్ఐసీ...

 కొత్త సేవలు ప్రారంభించిన ఎల్ఐసీ... ఇక ప్రీమియం చెల్లింపులు చాలా ఈజీ...
LIC INSTAPAY Service | మీరు 'ఇన్‌స్టాపే సర్వీస్' ఆప్షన్ ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు ఆటోమెటిక్‌గా మీ అకౌంట్‌లోంచి కట్ అవుతాయి.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC పాలసీహోల్డర్లకు శుభవార్త. ఇకపై మీరు ప్రీమియం చెల్లించడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన తేదీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం చెల్లించడానికి ఎల్ఐసీ ఆఫీసులో క్యూ కట్టాల్సిన అవసరం కూడా లేదు. పాలసీహోల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించిన ఎల్ఐసీ 'ఇన్‌స్టాపే సర్వీస్' ప్రారంభించింది. ఇది ఆటో పేమెంట్ సర్వీస్. మీరు 'ఇన్‌స్టాపే సర్వీస్' ఆప్షన్ ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు ఆటోమెటిక్‌గా మీ అకౌంట్‌లోంచి కట్ అవుతాయి. ఈ ఆప్షన్ ఎంచుకున్నందుకు మీరు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఒక ట్రాన్సాక్షన్‌లో ప్రీమియం, జీఎస్‌టీ, లేట్ ఫీజు కలిపి రూ.50,000 లోపు ఉండాలి. భారతదేశంలోని అన్ని బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 'ఇన్‌స్టాపే సర్వీస్' ఉపయోగించుకోవచ్చు.


LIC INSTAPAY Service: ఎల్ఐసీ ఇన్‌స్టాపే సర్వీస్ ఉపయోగించుకోండి ఇలా...
ముందుగా మీరు మీ బ్యాంకు వెబ్‌సైట్ లేదా బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ కావాలి.
Pay Bills సెక్షన్‌లో insurance ఆప్షన్ ఎంచుకోవాలి.
insurance ఆప్షన్‌లో మీకు ఇన్స్యూరెన్స్ కంపెనీల పేర్లు కనిపిస్తాయి.
వాటిలో Life Insurance corporation Of India సెలెక్ట్ చేయాలి.
మీ పాలసీ నెంబర్, పేరు, ప్రీమియం మొత్తం, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు నమోదు చేయాలి.
ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ప్రీమియం మొత్తం వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
Auto Pay ఆప్షన్ ఎంచుకుంటే ఇకపై ప్రీమియం చెల్లించాల్సిన తేదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
ప్రీమియం రసీదును కూడా ఎలక్ట్రానిక్ మోడ్ లేదా ఫిజికల్ మోడ్‌లో పొందొచ్చు.
చివరగా సబ్మిట్ క్లిక్ చేస్తే ప్రీమియం చెల్లింపు పూర్తవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి