25, జులై 2019, గురువారం

హైదరాబాద్ జిందాబాద్ మూడో వార్షికోత్సవం...

హైదరాబాద్ జిందాబాద్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు (21.07.2019) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారి అధ్యక్షతన సభ జరిగింది. సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వకేట్ శ్రీ పి నిరూప్ రెడ్డి గారు హైదరాబాద్ ను కాపాడుకుందాం - చారిత్రక కట్టడాలను కాపాడుకుందాం అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేశారు. 
                    సభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గడ్డం మోహన్ రావు గారిని, 2019 నీట్(ఎంబిబిఎస్)లో స్టేట్ 39వ ర్యాంకు, జాతీయస్థాయిలో 892 ర్యాంకు సాధించిన ఎర్రం లక్ష్మీ ప్రతిమ గారిని అభినందిస్తూ సన్మానించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి, కె.వీరయ్య, రమణ, పి. నాగేశ్వర్‌రావు, అమీన్,ఎర్రం శ్రీనివాస్‌, మల్లం రమేష్, శివప్రసాద్ సహయ కార్యదర్శులు సంజీవ రావు, విజరుకుమార్‌, పి.శ్రీనివాస్‌,కె.భరత్, జెకె శ్రీనివాస్ , మోహన్, నర్సింగ్,సంగీత, బాబు తదితరులు పాల్గొన్నారు.
                        వార్షికోత్సవంలో ప్రముఖ సీనియర్ మ్యాజిక్ కళాకారులు ఖాజా గారు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు కళారత్న మల్లం రమేష్ గారు, మిమిక్రీ కళాకారులు వేణుగోపాల్ గారు, నరేష్ గారు పాల్గొన్నారు.



4, జులై 2019, గురువారం

కొత్త సేవలు ప్రారంభించిన ఎల్ఐసీ...

 కొత్త సేవలు ప్రారంభించిన ఎల్ఐసీ... ఇక ప్రీమియం చెల్లింపులు చాలా ఈజీ...
LIC INSTAPAY Service | మీరు 'ఇన్‌స్టాపే సర్వీస్' ఆప్షన్ ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు ఆటోమెటిక్‌గా మీ అకౌంట్‌లోంచి కట్ అవుతాయి.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC పాలసీహోల్డర్లకు శుభవార్త. ఇకపై మీరు ప్రీమియం చెల్లించడానికి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన తేదీలను గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రీమియం చెల్లించడానికి ఎల్ఐసీ ఆఫీసులో క్యూ కట్టాల్సిన అవసరం కూడా లేదు. పాలసీహోల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించిన ఎల్ఐసీ 'ఇన్‌స్టాపే సర్వీస్' ప్రారంభించింది. ఇది ఆటో పేమెంట్ సర్వీస్. మీరు 'ఇన్‌స్టాపే సర్వీస్' ఆప్షన్ ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు ఆటోమెటిక్‌గా మీ అకౌంట్‌లోంచి కట్ అవుతాయి. ఈ ఆప్షన్ ఎంచుకున్నందుకు మీరు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఒక ట్రాన్సాక్షన్‌లో ప్రీమియం, జీఎస్‌టీ, లేట్ ఫీజు కలిపి రూ.50,000 లోపు ఉండాలి. భారతదేశంలోని అన్ని బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 'ఇన్‌స్టాపే సర్వీస్' ఉపయోగించుకోవచ్చు.


LIC INSTAPAY Service: ఎల్ఐసీ ఇన్‌స్టాపే సర్వీస్ ఉపయోగించుకోండి ఇలా...
ముందుగా మీరు మీ బ్యాంకు వెబ్‌సైట్ లేదా బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ కావాలి.
Pay Bills సెక్షన్‌లో insurance ఆప్షన్ ఎంచుకోవాలి.
insurance ఆప్షన్‌లో మీకు ఇన్స్యూరెన్స్ కంపెనీల పేర్లు కనిపిస్తాయి.
వాటిలో Life Insurance corporation Of India సెలెక్ట్ చేయాలి.
మీ పాలసీ నెంబర్, పేరు, ప్రీమియం మొత్తం, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు నమోదు చేయాలి.
ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ప్రీమియం మొత్తం వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
Auto Pay ఆప్షన్ ఎంచుకుంటే ఇకపై ప్రీమియం చెల్లించాల్సిన తేదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
ప్రీమియం రసీదును కూడా ఎలక్ట్రానిక్ మోడ్ లేదా ఫిజికల్ మోడ్‌లో పొందొచ్చు.
చివరగా సబ్మిట్ క్లిక్ చేస్తే ప్రీమియం చెల్లింపు పూర్తవుతుంది.

1, జులై 2019, సోమవారం

పేదలపైనే పెను ప్రభావం...

- 2030 నాటికి 120 కోట్ల మంది పేదరికాన్ని అనుభవించే ప్రమాదం 
- వాతావరణ మార్పులకు సంబంధించి ఐరాస నివేదిక ...జూన్ 25
జాతి వివక్ష, కుల వివక్ష, వర్ణ వివక్ష, లింగ వివక్ష, ప్రాంతీయ వివక్ష, మత వివక్ష..  ఆధునిక కాలంలో తాజాగా జరిగిన పరిణామాల వల్ల వాతావరణ వివక్ష అనే ఓ కొత్త పదం చేరిపోనున్నది. 
   వాతావరణ మార్పుల కారణంగా అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది పేదలేనని ఐరాస వెల్లడించింది. ధనిక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్నామ్యాయ మార్గాల కోసం అన్వేషిస్తారని తెలిపింది. అయితే, నిరుపేదలు మాత్రం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కూడా వివక్షకు లోనవుతున్నారని ఐరాస ప్రత్యేక ప్రతినిధి రాపోర్టిర్‌ ఫిలిప్‌ ఆస్టన్‌ తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించి జూన్ 25న ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌కు ఆయన ఓ నివేదికను అందజేశారు. దీనిలోని వివరాల ప్రకారం... వాతావరణంలోకి విడుదలవుతున్న ఉద్ఘారాల కారణంగా అన్ని దేశాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నది. మొక్కలు నాటడం బాగా తగ్గిపోయింది. చెట్ల నరికివేత పెరిగిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా 2030 నాటికి 120 మిలియన్ల మంది నిరుపేదలుగా మారే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది. 
సరైన వసతులు లేకపోవడంతో నిరుపేదలు ఇబ్బందిపడుతున్నారు. అనేక అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాల్లోనూ ఆశ్రయంలేని కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి.2100 నాటికి ప్రపంచ దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదముంది. ఫలితంగా తీవ్ర ఆహార కొరత, స్పల్ప ఆదాయం, సమతుల్య పౌష్టికాహారం లభించకపోవడం, ఆరోగ్య ప్రమాణాలు అంతరించడం వంటివి చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకలి చావు కేకలు ప్రతిధ్వనించే రోజులు ఆసన్నమైనవని ఆస్టన్‌ తన నివేదికలో హెచ్చరించారు. ఈక్రమంలో వలసలు బాగా పెరిగే అవకాశముందని అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్న మైనప్పుడు సంపన్న వర్గాలకు చెందినవారు ప్రత్యామ్నాయా లపై దృష్టిపెడతారు. వారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని సునా యాసంగా అధిగమించేం దుకు ప్రయత్నిస్తారు... అయితే, కష్టాల ఊబిలో కూరుకు పోయే వారంతా నిరుపేదలే నంటూ ఆస్టిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా మానవ హక్కు లకు భంగం వాటిల్లే ప్రమాదముందని అన్నారు. జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుందన్నారు. దీని ప్రభావం ప్రజాస్వామ్య దేశాలపై కూడా ఉంటుందని అన్నారు. 2012లో అమెరికాలో తుఫాను సంభవిం చినప్పుడు నెలకొన్న పరిస్థితుల గురించి ఆస్టిన్‌ ఉదహరిం చారు. న్యూయార్క్‌ నగరంలో చిమ్మచీకట్లు అలుము కున్నాయి. అనేక వారాలపాటు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచి పోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఆహార కొరత ఏర్పడింది. నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇలాంటి తరుణంలో గోల్డ్‌మాన్‌ సాచ్‌ వంటి సంస్థలు జనరేటర్ల సాయంతో అంధ కారాన్ని ఛేదించాయి. సంపన్న వర్గాలు ప్రత్నామ్నా యాల వైపు దృష్టి పెడతాయని చెప్పుకొచ్చారు. అనేక దేశాలు పర్యా వరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడు తున్నాయి. వాహనాల నుంచి గాల్లోకి విడుదల వుతున్న కార్బన్‌ మోనాక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించేందుకు పటిష్ట చర్య లు చేపడుతున్నాయి. అయితే, ఎన్ని చర్యలు చేపట్టి నప్పటికీ సత్ఫలితాలు దక్కడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
- అమెరికాలో 21శాతం నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతోంది. స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్‌ హయాంలోనూ నిరుద్యోగ సమస్య ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయింది. 
- నిరుద్యోగాన్ని పారదోలినట్టు వైట్‌హౌస్‌ వెల్లడించిన నివేదికలన్నీ బూటకమైనవే.
- రష్యా, చైనా వంటి దేశాలు అభివృద్ధిలో శరవేగంతో దూసుకుపోతున్నాయని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న మార్గాల కారణంగా అగ్రరాజ్యం ఆర్థికాభివృద్ధి తగ్గిపోయింది. 
- అమెరికాలో పనిచేస్తున్న వారి సంఖ్య దశాబ్దకాలం నుంచి తగ్గిపోయింది. 2009లో పనిచేస్తున్న వారి శాతం 65.7 ఉండగా, ఈఏడాది 62.8శాతానికి పడిపోయిందని సంస్థ తెలిపింది. 
- పెట్టుబడిదారుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నవారు కూడా ఇతరుల దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకొని పెడుతున్నారని నివేదిక పేర్కొంది. 
- ద్రవ్యోల్బణం రేటు కూడా బాగా పెరిగింది. 
- అగ్రరాజ్యంలోనూ నిరుద్యోగ సమస్య తలెత్తింది. 
- ఉద్యోగాన్వేషణలో ఉన్న యువత శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఉద్యోగాల వైపు యువత ఆకర్షితులు కాకపోవడం అగ్రరాజ్యాన్ని బాధిస్తోంది.