కిరణం - వీరయ్య కె

28, జూన్ 2019, శుక్రవారం

ఎదగని బాల్యం..

- లోపాన్ని తగ్గించడంలో భారత్‌ విఫలం

- 2022కల్లా పౌష్టికాహార లోపముండే చిన్నారులు 31.4 శాతం

- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే అధికం :యూఎన్‌ నివేదికలో వెల్లడి 

 చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని నివారించడంలో భారత్‌ విఫలమైందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక స్పష్టం చేసింది. లోపాన్ని సవరించడంలో ఏటా ఒక్క శాతం మాత్రమే పురోగతి నమోదవుతున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే అతి తక్కువ అని నివేదికలో పేర్కొన్నారు. దీంతో, 2022 వరకల్లా ఇండియాలో ఎదుగుదలలేని చిన్నారులు 31.4 శాతం వరకూ ఉండనున్నట్టు న్యూట్రిషన్‌ సెక్యూరిటీ అనాలిసిస్‌, ఇండియా 2019 నివేదికలో అంచనా వేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌తో కలిసి యూఎన్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ తయారు చేసిన ఈ నివేదిక జూన్‌ 25న విడుదలైంది.
ఎదుగుదల లోపాన్ని ఏటా కనీసం 2 శాతం చొప్పున తగ్గిస్తామని జాతీయ పౌష్టికాహార కార్యక్రమం(ఎన్‌ఎన్‌ఎం) కింద నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో భారత్‌ విఫలమైనట్టు నివేదిక స్పష్టం చేసింది. 2022 వరకల్లా పౌష్టికాహార లోపమున్న చిన్నారుల సంఖ్యను 25 శాతానికి కుదించాలన్నది ఎన్‌ఎన్‌ఎం టార్గెట్‌. గడిచిన రెండు దశాబ్దాల్లో ఆహారధాన్యాల ఉత్పత్తి 33 శాతం అధికమైంది. కానీ, ఆహార ధాన్యాలను తలసరిగా అందుబాటులోకి తేవడం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. ఫలితంగా తక్కువ ఆదాయవర్గాలకు చెందిన దేశంలోని 30 శాతంమంది జాతీయ సగటు వినియోగం రోజుకు 1811 కిలో కెలోరీలు మాత్రమే. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) సూచించిన 2155 కిలో కెలోరీలకన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం. 

వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 9:59 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: ఆరోగ్యం, బారత దేశం

ముంబయి, చెన్నై మించి హైదరాబాద్‌ కాలుష్యం...

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా మొదటి స్థానంలో గుర్గావ్‌ 
ప్రపంచంలోని అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ నిలిచింది.
అలాగే తెలంగాణలో కాలుష్యం రోజురోజుకూ తీవ్రతరమవు తున్నది. ఏటేటా పెరుగుతున్న కాలుష్యం...ముంబయి, చెన్నై మించి ముందుకు హైదరాబాద్‌...



వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 9:52 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: పర్యావరణం

23, జూన్ 2019, ఆదివారం

ప్లాస్టిక్ తింటున్నారు...

ప్రజా ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ ని పారద్రోలండి.
మనం మారుదాం, మిత్రులను మారుద్దాం...

వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 9:42 PM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: పర్యావరణం

14, జూన్ 2019, శుక్రవారం

శాంతిలో ఐదు మెట్లు జారి...

శాంతిలో ఐదు మెట్లు జారి... భారత్‌కు 141వ ర్యాంకు
- పొరుగు దేశాలు మనకన్నా నయం
- రాజకీయ, హిందూత్వ శక్తులే కారణం : ప్రజాస్వామ్యవాదులు
మానవాళి క్షేమాన్ని కాంక్షించి ప్రపంచానికి శాంతిని బోధించిన భారతదేశంలో అశాంతి రాజ్యమేలుతోంది. తాజాగా విడుదలైన 2019-ప్రపంచ శాంతి సూచి (జీపీఐ) ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. శాంతి సూచిలో భారత్‌ గతేడాది కంటే ఐదు స్థానాలు దిగజారి 141 ర్యాంకు (మొత్తం 163 దేశాలు)కు పడిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌' అనే సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. మూడు అంశాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించినట్టు సంస్థ ప్రతినిధి స్టీవ్‌ కిల్లియెలా తెలిపారు. అవి.. 1)సామాజిక భద్రత, రక్షణ 2) జాతీయ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య సంఘర్షణలు 3) దేశంలో పెరుగుతున్న సైనికీకరణ.
నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. యూరప్‌ దేశం ఐస్‌లాండ్‌ మరోసారి జీపీఐలో ప్రథమ స్థానంలో నిలబెట్టు కున్నది. ఆ దేశం 2008 నుంచి వరుసగా మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. తర్వాతి స్థానాలలో న్యూజీలాండ్‌, పోర్చుగల్‌, డెన్మార్క్‌లు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి మన పొరుగు దేశమైన భూటాన్‌ 15వ స్థానంలో ఉండగా.. శ్రీలంక (72), నేపాల్‌ (76), బంగ్లాదేశ్‌ (101)లు గతంలో కంటే తమ ర్యాంకును మెరుగుపర్చుకున్నాయి. దాయాది దేశం పాక్‌ 153వ స్థానంలో ఉంది. ఇక నిత్యం ఉగ్రదాడులతో వణికిపో తున్న అఫ్ఘనిస్తాన్‌ చివరి స్థానంలో ఉంది. శాంతిని నెలకొల్ప డంలో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దక్షిణాసియాలో పెద్దగా మార్పులేమీ లేవని నివేదిక వెల్లడించింది. శాంతి సూచితో పాటు వాతావరణంలో మార్పులు సంభవించి పర్యావరణ ప్రమాదం పొంచి ఉన్న తొమ్మిది దేశాలలో భారత్‌ ఉండటం ఆందోళనకు గురి చేసే అంశం. ఈ జాబితాలో ఫిలిప్పీన్స్‌, జపాన్‌, చైనా వంటి దేశాలున్నాయి. ఇక సైన్యం మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్న దేశాల జాబితాలోనూ భారత్‌ ఉండటం గమనార్హం.


వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 10:43 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: బారత దేశం

7, జూన్ 2019, శుక్రవారం

గులాబీకే పట్టం...

- 2019 ప్రాదేశిక పోరులో కారుకు ఊరట
- భారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు 
- 3,557 ఎంపీటీసీలు, 445 జెడ్పీటీసీల కైవసం
- రెండో స్థానంలో కాంగ్రెస్‌.. బీజేపీకి షాక్‌

- 76 ఎంపీటీసీల్లో వామపక్షాలు విజయం


ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు..
పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ 
టీఆర్‌ఎస్‌  3557        445 
కాంగ్రెస్‌     1377         75 
బీజేపీ        211           8 
సీపీఐ(ఎం)  49            - 
సీపీఐ         35            - 
టీడీపీ         21            - 

స్వతంత్రులు 573       05 






వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 7:44 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: ఎన్నికలు

4, జూన్ 2019, మంగళవారం

దేశంలో బీజేపీ ప్రస్థానం...



వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 10:56 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన బీజేపీ ఓటింగ్ శాతం...

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 




వీరిచే పోస్ట్ చేయబడింది వీరయ్య కె వద్ద 10:53 AM కామెంట్‌లు లేవు:
దీన్ని ఈమెయిల్‌ చేయండిBlogThis!Xకు షేర్ చేయండిFacebookకు షేర్ చేయండిPinterestకు షేర్ చేయండి
లేబుళ్లు: ఎన్నికలు
కొత్త పోస్ట్‌లు పాత పోస్ట్‌లు హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి: పోస్ట్‌లు (Atom)

మీ కోసం ...

  • అభ్యుదయం (18)
  • ఆరోగ్యం (61)
  • ఇతరములు (11)
  • ఎన్నికలు (54)
  • ఒక చిరుదివ్వె... (21)
  • కొన్ని మా జ్ఞాపకాలు (29)
  • క్రీడలు... (14)
  • చిత్రకళ కళ.. (10)
  • తీర్పులు (19)
  • తెలంగాణ రాష్ర్టం (36)
  • దినోత్సవాలు (20)
  • పర్యావరణం (52)
  • బారత దేశం (22)
  • మహా నేతల జన్మదినాలు... వర్ధంతులు... (22)
  • యాత్రలు..పర్యాటక ప్రదేశాలు (37)
  • వింతలు..విచిత్రాలు (10)
  • విజ్ఞానం-విద్యార్థులు (37)
  • వీడియోలు... (2)
  • శుభాకాంక్షలు (44)
  • సమస్యలు (22)
  • సామాజికం... (6)
  • సినీమా... (2)
  • హైదరాబాద్‌ జిందాబాద్‌ (74)
  • హైదరాబాద్.. (45)
  • LIC (8)

నలుగురు మెచ్చినవి...

  • మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు...
  • మిత్రులందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు...
  • 55ఏళ్ల వ్యక్తితో 16ఏళ్ల యువతి పెళ్లి ....?
  • ఇకపై చేతులు ఊపుకుంటూ మార్కెట్‌కు వెళ్లడం కుదరదు....

మొత్తం వీక్షణలు

Flag Counter

counters

నా గురించి

నా ఫోటో
వీరయ్య కె
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి

బ్లాగు ఆర్కైవ్

  • ►  2021 (3)
    • అక్టోబర్ (1)
    • ఏప్రిల్ (1)
    • మార్చి (1)
  • ►  2020 (51)
    • డిసెంబర్ (1)
    • ఆగస్టు (7)
    • జులై (3)
    • జూన్ (1)
    • మే (10)
    • ఏప్రిల్ (6)
    • మార్చి (13)
    • ఫిబ్రవరి (6)
    • జనవరి (4)
  • ▼  2019 (68)
    • డిసెంబర్ (4)
    • నవంబర్ (3)
    • అక్టోబర్ (2)
    • సెప్టెంబర్ (5)
    • ఆగస్టు (8)
    • జులై (3)
    • జూన్ (7)
    • మే (5)
    • ఏప్రిల్ (9)
    • మార్చి (12)
    • ఫిబ్రవరి (2)
    • జనవరి (8)
  • ►  2018 (70)
    • డిసెంబర్ (11)
    • నవంబర్ (11)
    • అక్టోబర్ (4)
    • సెప్టెంబర్ (13)
    • ఆగస్టు (7)
    • జులై (7)
    • జూన్ (5)
    • మే (3)
    • ఏప్రిల్ (3)
    • జనవరి (6)
  • ►  2017 (30)
    • డిసెంబర్ (4)
    • నవంబర్ (4)
    • అక్టోబర్ (7)
    • సెప్టెంబర్ (7)
    • ఆగస్టు (4)
    • జులై (2)
    • జనవరి (2)
  • ►  2016 (43)
    • అక్టోబర్ (2)
    • సెప్టెంబర్ (9)
    • ఆగస్టు (5)
    • జులై (4)
    • జూన్ (5)
    • మే (2)
    • ఏప్రిల్ (9)
    • మార్చి (2)
    • ఫిబ్రవరి (5)
  • ►  2015 (15)
    • నవంబర్ (1)
    • అక్టోబర్ (6)
    • సెప్టెంబర్ (2)
    • ఆగస్టు (3)
    • జూన్ (2)
    • మే (1)
  • ►  2014 (71)
    • నవంబర్ (1)
    • అక్టోబర్ (12)
    • సెప్టెంబర్ (2)
    • ఆగస్టు (5)
    • జులై (9)
    • జూన్ (9)
    • మే (11)
    • ఏప్రిల్ (8)
    • మార్చి (6)
    • ఫిబ్రవరి (4)
    • జనవరి (4)
  • ►  2013 (55)
    • డిసెంబర్ (7)
    • నవంబర్ (4)
    • అక్టోబర్ (6)
    • సెప్టెంబర్ (14)
    • ఆగస్టు (19)
    • జులై (5)
  • ►  2011 (64)
    • డిసెంబర్ (1)
    • నవంబర్ (2)
    • అక్టోబర్ (2)
    • సెప్టెంబర్ (4)
    • ఆగస్టు (8)
    • జులై (8)
    • జూన్ (7)
    • మే (18)
    • ఏప్రిల్ (14)
సమూహము: Telugu Blogs
శోధిని
కూడలి
లేఖిని (lekhini): type in telugu
poodanda


మాలిక: Telugu Blogs
సాధారణ థీమ్. caracterdesign ద్వారా థీమ్‌లు. Blogger ఆధారితం.