- లోపాన్ని తగ్గించడంలో భారత్ విఫలం
- 2022కల్లా పౌష్టికాహార లోపముండే చిన్నారులు 31.4 శాతం
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే అధికం :యూఎన్ నివేదికలో వెల్లడి
చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని నివారించడంలో భారత్ విఫలమైందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక స్పష్టం చేసింది. లోపాన్ని సవరించడంలో ఏటా ఒక్క శాతం మాత్రమే పురోగతి నమోదవుతున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇదే అతి తక్కువ అని నివేదికలో పేర్కొన్నారు. దీంతో, 2022 వరకల్లా ఇండియాలో ఎదుగుదలలేని చిన్నారులు 31.4 శాతం వరకూ ఉండనున్నట్టు న్యూట్రిషన్ సెక్యూరిటీ అనాలిసిస్, ఇండియా 2019 నివేదికలో అంచనా వేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్‌తో కలిసి యూఎన్ ఫుడ్ ప్రోగ్రామ్ తయారు చేసిన ఈ నివేదిక జూన్ 25న విడుదలైంది.
ఎదుగుదల లోపాన్ని ఏటా కనీసం 2 శాతం చొప్పున తగ్గిస్తామని జాతీయ పౌష్టికాహార కార్యక్రమం(ఎన్‌ఎన్‌ఎం) కింద నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో భారత్ విఫలమైనట్టు నివేదిక స్పష్టం చేసింది. 2022 వరకల్లా పౌష్టికాహార లోపమున్న చిన్నారుల సంఖ్యను 25 శాతానికి కుదించాలన్నది ఎన్‌ఎన్‌ఎం టార్గెట్. గడిచిన రెండు దశాబ్దాల్లో ఆహారధాన్యాల ఉత్పత్తి 33 శాతం అధికమైంది. కానీ, ఆహార ధాన్యాలను తలసరిగా అందుబాటులోకి తేవడం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. ఫలితంగా తక్కువ ఆదాయవర్గాలకు చెందిన దేశంలోని 30 శాతంమంది జాతీయ సగటు వినియోగం రోజుకు 1811 కిలో కెలోరీలు మాత్రమే. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సూచించిన 2155 కిలో కెలోరీలకన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి