- 9 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు
- 4 చోట్ల బీజేపీ సంచలన విజయం
- 3 స్థానాలు కాంగ్రెస్ కైవసం,
- ఒక స్థానంలో మజ్లిస్
- ఓటమిపాలైన కవిత, వినోద్ కుమార్...
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ సత్తాచాటింది. మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల గెలిచి ఆధిపత్యం చాటుకుంది. డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో 119 సీట్లకు గానూ 88 సీట్లలో గెలిచి ప్రభంజనం సృష్టించినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నాయకత్వం ఆశించింది. టీఆర్‌ఎస్ 16 స్థానాలు, మిత్రపక్షం మజ్లిస్‌కు ఓ స్థానం కలిపి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలను తామే దక్కించుకుంటామని ప్రకటించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన టీఆర్‌ఎస్ తాజా ఎన్నికల్లో 9 స్థానాలకు పరిమితమైంది.సంఖ్యాపరంగా రెండు స్థానాలను కోల్పోయింది. మూడు సిట్టింగ్ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోగా, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి అందని ద్రాక్షగా ఉన్న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి