2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యాభై శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్ స్లిప్పులను, లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 35 వీవీప్యాట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో సరిపోల్చాలని ఈసీని ఆదేశించింది. ప్రతిపక్షాలు కోరినట్టుగా 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి