29, జులై 2018, ఆదివారం

నల్లకుంట నాలాపై పూడిక పనులు ప్రారంభం...

నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం లైన్‌లో నాలాపై 47 సంవత్సరాల తరువాత మొదటి సారి 27.07.2018 న పూడిక పనులు ప్రారంభమైనాయి. మూడు రోజుల క్రితం ఎం.ఎల్‌.ఏ గారు పాదయాత్ర చేసి, జి.హెచ్‌.ఎం.సి.వారి పై వత్తిడి చేయడంతో పూడిక తీసే పనులు ప్రారంభించారు. పాత రామాలయం లైన్‌లో నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, నాలా పూడిక తీయాలని సంవత్సరం నుండి ఎం.ఎల్‌.ఏ గారికి మరియు జి.హెచ్‌.ఎం.సి.లో అనేక సార్లు వినతి పత్రం సమర్పించడం జరిగింది. సమస్యల పరిష్కారం కోరకు '' నల్లకుంట పాత రామాలయం లైన్‌ రెసిడెట్స్‌ అసోసియేషన్‌ '', '' హైదరాబాద్‌ జిందాబాద్‌'' సభ్యులు కృషి చేశారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి