30, జులై 2018, సోమవారం

ఫంక్షన్ లో కలిసిన రేమద్దుల స్కూల్‌ బ్యాచ్‌ స్నేహితుల బృందం...

ఎం.డి. అస్మత్ గృహప్రవేశం సందర్బంగా... 
29.07.2018 రాత్రి ఫంక్షన్ లో హైదరాబాద్ లో కలిసిన 
రేమద్దుల స్కూల్‌ 1991-92 బ్యాచ్‌ స్నేహితుల బృందం... 

29, జులై 2018, ఆదివారం

నల్లకుంట నాలాపై పూడిక పనులు ప్రారంభం...

నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం లైన్‌లో నాలాపై 47 సంవత్సరాల తరువాత మొదటి సారి 27.07.2018 న పూడిక పనులు ప్రారంభమైనాయి. మూడు రోజుల క్రితం ఎం.ఎల్‌.ఏ గారు పాదయాత్ర చేసి, జి.హెచ్‌.ఎం.సి.వారి పై వత్తిడి చేయడంతో పూడిక తీసే పనులు ప్రారంభించారు. పాత రామాలయం లైన్‌లో నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, నాలా పూడిక తీయాలని సంవత్సరం నుండి ఎం.ఎల్‌.ఏ గారికి మరియు జి.హెచ్‌.ఎం.సి.లో అనేక సార్లు వినతి పత్రం సమర్పించడం జరిగింది. సమస్యల పరిష్కారం కోరకు '' నల్లకుంట పాత రామాలయం లైన్‌ రెసిడెట్స్‌ అసోసియేషన్‌ '', '' హైదరాబాద్‌ జిందాబాద్‌'' సభ్యులు కృషి చేశారు.




25, జులై 2018, బుధవారం

స్పూర్తిదాయక ప్రభుత్వ సుపరిపాలన లో టాప్‌లో కేరళ రాష్ట్రం..

స్పూర్తిదాయక ప్రభుత్వ సుపరిపాలన లో టాప్‌లో కేరళ రాష్ట్రం...3వ ర్యాంకు తెలంగాణ రాష్ర్టం, 9వ ర్యాంకు  ఏ.పి
                 కేరళ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని, ప్రజలు సామా జికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయని పబ్లిక్‌ అఫైర్స్‌ సెంటర్‌(పీఏసీ) నివేదిక వెల్లడించింది. కర్నాటకకు చెందిన పీఏసీ విడుదల చేసిన పబ్లిక్‌ అఫైర్స్‌ ఇండెక్స్‌ 2018 నివేది క ఈ మేరకు వివరించింది. మొత్తం 30 ప్రధానమైన విషయాలు, 100 సూచికలను మదించి ఈ నివేదికను రూపొందించినట్టు పీఏసీ తెలిపింది. ప్రయివేటు సమాచారాన్ని కాకుండా ప్రభుత్వ అధికారిక సమాచారాన్నే ఈ నివేదిక రూపకల్పనకు వినియోగించామని తెలిపింది. దేశంలోని మొత్తం రాష్రా ్టలను జనాభా ఆధారంగా పెద్ద, చిన్న రాష్ట్రాలుగా విభజించి వాటి ర్యాంకులను నిర్ణయిస్తామని వివరించింది. కాగా, ఏడాదికోసారి విడుదల చేసే ఈ నివేదికలో కేరళ టాప్‌లో రావడం వరసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. 

23, జులై 2018, సోమవారం

22, జులై 2018, ఆదివారం

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం...Hyderabad zindabad

బిపి, షుగర్ ఉచిత వైద్య శిబిరం... 
హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 22-07-2018 న జరిగింది. టెస్టులు, వైద్యం, ఉచితం..... 
ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 7.00 గం||ల నుండి 9.00 గం||ల వరకు జరుగుతుంది. 
మాతృశ్రీ ఇ ఎల్‌ స్కూల్‌ (సాయిబాబ గుడి ఎదుట)లో, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.








19, జులై 2018, గురువారం

పర్యావరణంపై వై జ్ఞానిక ఎగ్జిబిషన్‌.... Hyderabad zindabad

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో  అవగాపర్యావరణంపైహనకల్పించేందుకు వై జ్ఞానిక ఎగ్జిబిషన్‌...కవాడిగూడ లో (హైదరాబాద్‌)....
Krishna Shekar, Dy.Commissioner, Musheerabad Circle Participated in Environment Exhibition by Hyderabad Zindabad at Community Hall, Thalla Basthi, Kavadiguda....