23, ఏప్రిల్ 2018, సోమవారం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా '' ఉచిత మెగా వైద్య శిబిరం... Hyderabad zindabad

          ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో 08.4.2018 బాగ్‌లింగంపల్లిలో మాతృశ్రీ ఇ యాండ్ ఎల్‌ స్కూల్‌ లో ''ఉచిత మెగా వైద్య శిబిరం'' ను నిర్వహించారు. ఈ ఉచిత మెగా శిబిరాన్ని నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, ప్రముఖ హార్ట్‌ సర్జన్‌ డా|| దాసరి ప్రసాద్‌రావు గారు ప్రారంభించారు.
             డా|| దాసరి ప్రసాద్‌రావు గారు మాట్లాడుతూ వైద్యం ప్రజలందరికీ ప్రాథమిక అవసరమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే కృషి అభినందనీయం అని అన్నారు.
              ప్రముఖ ఇఎన్‌టి సర్జన్‌, నోవా హాస్పిటల్‌ అధినేత డా|| ఎం. మోహన్‌ రెడ్డి గారు , ఆర్థో సర్జన్‌ డా|| రామకిషన్‌ గారు , డెంటల్‌ సర్జన్‌  ఇండిన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యాక్షలు డా|| కె. ఆదిత్య సందీప్‌ గారు, చిన్నపిల్లల వైద్యనిపుణులు డా||మహాదేవ్‌ గారు, చర్మవాధుల నిపుణులు డా|| నీనా నిమ్మ గారు, మాజీ మెడికల్‌ ఆఫీసర్‌ డా|| ఎం. ఉపేందర్‌ రెడ్డి గారు, గెండె సర్జన్‌ డా|| వెంకటేష్‌ గారు ఆయా విభాగాలలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. శిబిరంలో గుండె, చెవి ముక్కు గొంతు, కంటి, దంతం, చిన్నపిల్లలు, చర్మ వ్యాధులు,జనరల్‌ వంటి ప్రధానమైన అన్ని వ్యాధులకు సంబంధించిన సమస్యల వైద్యం, టెస్టులు, అవగాహన కార్యక్రమాలు జరిగినాయి.  
భా రీ వర్షం వచ్చిన, కాని ఉచిత మెగా వైద్య శిబిరం లో దాదాపు 450 మంది పాల్గొన్నారు
               సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు , ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులు కె. వీరయ్య, వి. విజరుకుమార్‌, నాయకులు పి. నాగేశ్వరరావు, పి.శ్రీనివాస్‌, టిఎన్‌వి రమణ, జెకె శ్రీనివాస్‌ లు నాయకత్వం వహించారు. ప్రభాకర్‌, పి. నాగేష్‌, వెంకటేష్‌, మణిక్యం, సంగీత, దుర్గ, కె. రాజ్యలక్ష్మి, లత, అజరు, మోహన్‌రెడ్డి, నవీన్‌కృష్ణ తదితరులు సేవలందించారు. 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా '' ఉచిత మెగా వైద్య శిబిరం..దృశ్యాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి