5, సెప్టెంబర్ 2013, గురువారం

గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

           ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.  ప్రతియేటా  సెప్టెంబర్‌ 5 వారి జన్మదినం సందర్భముగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి.

          తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవితకు ఉపాధ్యాయులే ప్రత్యక్ష దైవాలుగా భావించి, తమ పిల్లలను పాఠశాలలో చేర్చుతారు. కొండంత ఆశతో పిల్లల బంగారు భవితకై ఎదురు చూస్తుంటారు. తల్లిదండ్రుల ఆశలను నిజంగా నిజం చేయుట కొఱకు అహర్నిశలూ తమ విద్యార్థుల అభ్యున్నతికై కొంత మంది గురువులు  శ్రమిస్తారు. అలాంటి  నిజమైన నిస్వార్థ ఉపాధ్యాయులను ఎంతగా గౌరవించినా అది తక్కువే ఔతుంది. 

     సమాజంలో గురువులకు ఇచే గౌరవాలు, విలువలు కాలమాన పరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి.  ఉదారవాద ఆర్థిక విధానాలు అన్ని రంగాలనూ ప్రభావితం చేసినట్లే విద్యారంగాన్ని, ఉపాధ్యాయ వృత్తినీ దెబ్బతీస్తున్నాయి. సమాజంలో విద్యా, వైజ్ఞానిక అవసరాలు ఉన్నంతకాలం, సమాచార సాంకేతిక వ్యవస్థ ఎంత విస్తరించినా ఉపాధ్యాయుల పాత్ర అజరామరంగా నిలుస్తుంది.
           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి