17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే గొప్ప రోజు...

              సెప్టెంబర్‌ 17 కొందరు చెబుతున్నట్లుగా నైజాం ప్రభుత్వాన్ని కేంద్రం పంపిన బలగాలే లొంగదీసుకున్నాయన్నది కూడా చరిత్రకు వక్రీకరణే. నిజానికి మొదట నిజాం రాజుతో నెహ్రూ ప్రభుత్వం యథాతథ ఒప్పందం చేసుకొని రాజీ పడ్డది. సాయుధ రైతాంగ పోరాటం ఉధృతం కావడంతో నిజాం పాలన కూలిపోయే దశకు చేరిన తరువాతనే కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని అణిచివేయడం కోసమే నెహ్రూ సైన్యాలు రంగంలోకి దిగాయి. 1947లో పాకిస్తాన్‌తో యుద్ధంలో ప్రయోగించిన సైన్యం కంటే ఇక్కడ కమ్యూనిస్టులను అణిచేందు కోసం ఎక్కువ సైన్యాన్ని నెహ్రూ ప్రభుత్వం ప్రయోగించిన విషయాన్ని మరచిపోరాదు. పటేల్‌ నేతృత్వంలో ఈ సైన్యం నాలుగు వేల మంది కార్యకర్తలను పొట్టనపెట్టుకుంది. సెప్టెంబర్‌ 17న నిజాం ప్రభువు లొంగిపోయిన తరువాత కూడా రాజప్రముఖ్‌ హోదా కొనసాగించారు.

       సెప్టెంబర్‌ 17 నిజాం పాలనలోని హైదరాబాద్‌ స్టేట్‌ ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన రోజు. భూమి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట ఫలితమిది. రాచరిక పాలన నుంచి విముక్తి లభించినప్పటికీ భూమి సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. భూస్వామ్య దోపిడీ నుంచి పూర్తిగా విముక్తి సాధించలేదు. పైగా హైదరాబాద్‌ విముక్తి దినోత్సవంగా సెప్టెంబర్‌ 17కు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. కొందరు ప్రస్తుత రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి చరిత్రను వక్రీకరిస్తున్నారు. 

 ప్రపంచ  పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...
సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్న రోజు... 
  • ( ప్రజాశక్తి    సహకారంతో ...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి