31, ఆగస్టు 2013, శనివారం

మిత్రుని పెళ్ళి ఫోటొ...

           మిత్రుడు జగదీష్ పెళ్ళి 25.08.2013 న మేడిపూర్ లో జరిగింది.  నేను, నా మిత్రులు మరియు వారి ఆఫీసు సిబ్బంది కలిసి దాదాపు 37 మందిమి ఒక బస్సులో బయలుదేరి వేళ్ళినాము. హైదరాబాద్  నుండి కల్వకుర్తి  మిదుగా మేడిపూర్ గ్రామం చేరుకునే సరికి దాదాపు 98 కీ.మి.లు  అయింది. మేము వేళ్ళిన కొద్దిసేపటికే పెళ్ళి జరిగింది.  పెళ్ళి అనంతరం  జగదీష్ కు అందరు  శుభాకాంక్షలు తేలియజేశారు .

    హైదరాబాద్ తిరిగి వస్తూ కడ్తాల్ వద్ద నిర్మాణంలో పిరమిడ్ ను సందర్శించడం జరిగింది. గత ఆదివారం మిత్రులతో ఉత్సహంగా, ఉల్లాసంగా గడిచింది.


29, ఆగస్టు 2013, గురువారం

బ్లాగ్ మిత్రులందరికీ...శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

          మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల నల్ల బాలుడు చేతిలో వెన్న పట్టుకుని వున్న యశోదనందనుడు చిన్ని కృష్ణుడుగా  గుర్తు.  శ్రీ మహావిష్ణువు లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు. అందులో  ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని అంటారని చేపుతారు.

     మిత్రులందరికీ...శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు

  గత సం.10.08.2012 న నాగర్ కర్నూలులో మా పిల్లలు శ్రీకృష్ణాష్టమి జరుపుకున్నారు.  వారి ఫోటోలు...






24, ఆగస్టు 2013, శనివారం

హైదరాబాద్ లో వర్షలు ఫూల్. త్రాగడానికి నీరు లేదు...

ఈ సంవత్సరం  ఎపుడు లేని విదంగా  హైదరాబాద్ లో వర్షలు ఫూల్.
ఆవి కూడా జూన్ నుండి వచ్చినాయి. కాని నేడు  త్రాగడానికి నీరు లేదు... 
దీనితో పేద, మద్యతరగతి ప్రజలకు నీటి సమస్యలు మారిన్ని రానున్నాయి.   
ఈ సమస్యలకు మూల కారణం ఎవరు ? వర్షలు భాగా వచ్చిన నీరు ఎందుకు రావడం లేదు ?  పాలకులు, నాయకులు ... కారణం కాదా ?   

23, ఆగస్టు 2013, శుక్రవారం

రాఖి పౌర్ణమి కొన్ని మా ఫోటొలు..

21.08.2013 న జరిగిన రాఖి పౌర్ణమి పండుగ రోజు
శుభాకాంక్షలు తేలియజేస్తూ రాఖిలు కట్టుతున్న ఫోటొలు.
ఈ రాఖి పౌర్ణమి సందర్భంగా కొన్ని మా జ్ఞాపకాలు.
   




19, ఆగస్టు 2013, సోమవారం

కళకు జీవం...చిత్రానికి ప్రాణం...

 ఫోటోగ్రాఫర్లలందరికి
 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలతో....

 నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం



18, ఆగస్టు 2013, ఆదివారం

భగత్ సింగ్ 'షహీద్' కాదా?...


దేశ వాప్తంగా నిరసనలు..
భగత్‌సింగ్‌ను అమరుడు కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ చిన్నవయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు భగత్‌ సింగ్‌ అని తెలిపారు. పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన యోధుడిని కేంద్ర ప్రభుత్వం కించపరిచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం భగత్‌సింగ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

వైద్యమే సేవా...


ఈనాడు పత్రిక సౌజన్యం తో... 

9, ఆగస్టు 2013, శుక్రవారం

పండుగలల్లో పవిత్రమైన'రంజాన్'శుభాకాంక్షలతో...!



         ముస్లిం సోదర సోదరీమణులకు 'రంజాన్' పండుగ అత్యంత పవిత్రమైన, ప్రధానమైనది. సందేశాత్మక పండుగలల్లో  ముస్లింలు త్యాగానికి ప్రతీతగా, భక్తీ భావంతో జరుపుకునే పండుగ.  
          ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికి   నా హృదయపూర్వక 'రంజాన్' శుభాకాంక్షలు! 

4, ఆగస్టు 2013, ఆదివారం

కలకాలం నిలిచేదే ...


కలకాలం నిలిచేదే ...

 అభిమానాన్ని, అనుబంధాన్ని, ఆప్యాయతను, ప్రేమను,
 ఇస్టాన్ని, సంతోషాన్ని, బాధను పంచుకోగలిగేది స్నేహం.
 ఈ స్నేహానికి తర తమ బేధాలుండవు.
 కల్మషం లేని స్నేహం కలకాలం పదిలంగానే మధురంగా ఉంటుంది.
 కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహానుబంధం. 

  ఏ స్నేహమైనా ఏదో ఒక క్షణంలో గుర్తు వస్తూనే ఉంటుంది.
 ఏ వయస్సులోనైనా స్నేహం తీయని గురుతుగానే మిగిలిపోతుంది.

          అందుకే అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!