18, ఆగస్టు 2013, ఆదివారం

భగత్ సింగ్ 'షహీద్' కాదా?...


దేశ వాప్తంగా నిరసనలు..
భగత్‌సింగ్‌ను అమరుడు కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ చిన్నవయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు భగత్‌ సింగ్‌ అని తెలిపారు. పెట్టుబడిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన యోధుడిని కేంద్ర ప్రభుత్వం కించపరిచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం భగత్‌సింగ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

2 కామెంట్‌లు:

  1. సాంకేతికంగా చూస్తే అలాంటివి చెయ్యాలంటే లోక్ సభ లో బిల్లు పెట్టి అమోదించాలి.ఇప్పటివరకూ లోక్ సభ లో అలాంటి ప్రస్తావన లేమీ జరగలేదు కదా!ఐనా ఇప్పుడు భగత్ సింగ్ కు చేస్తే రేపు ప్రతి అడ్దమైన వెధవా నాకు నచ్చ్చినోడు మా బామ్మర్ది ఉన్నాడు, వాణ్ణీ అమర వీరుడిగా ప్రకటించండని తయారవుతాడేమో.యెందుకొచ్చిన గోల. జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల అన్నట్టు గుండెల్లో ఉన్నవాడికి చిహ్నా లెందుకు?

    రిప్లయితొలగించండి
  2. నిజమే సారు. కాని భగత్‌సింగ్‌ పేరు వినిపిస్తేనే భారతీయులందరికి హృదయాలు ఉత్తేజితమవుతాయి. దేశంకోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలిన విప్లవవీరుడు భగత్‌సింగ్‌. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే మనస్సు ఉద్వేగానికి లోనవుతుంది. భగత్‌సింగ్‌ ఒక రగులుతున్న కాగడాల నుండి ఎగిసిపడే చైతన్యపు జ్వాల. భగత్‌సింగ్‌ ఒక విప్లవ స్ఫూర్తి.

    రిప్లయితొలగించండి