- 63మంది శతకోటీశ్వరుల మనీ కేంద్ర బడ్జెట్‌కన్నా ఎక్కువ
పేదల్ని కొట్టి...కార్పొరేట్లకు..
-- శ్రమ దోపిడీలో మహిళలు, చిన్నారులు
- ప్రభుత్వ విధానాలు మారాలి... లేదంటే ప్రజలు తిరగబడతారు : ఆక్స్‌ఫామ్
ఈదేశంలో పేదలు, మధ్యతరగతి, ముఖ్యంగా మహిళల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు. వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి సంపన్నులు పైకి ఎగబాకుతున్నారు. దేశంలో 95 కోట్ల మంది (70 శాతం జనాభా) సంపదకు నాలుగురేట్లు....ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల వద్ద పోగైంది. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సీఈఓ 10 నిమిషాల్లో పొందుతున్న ఆదాయం...ఒక సాధారణ మహిళా కార్మికురాలి ఏడాది ఆదాయానికి సమానం. పేదలు-సంపన్నుల మధ్య అసమానతలు తొలగించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయటం లేదు. సంపన్నులపై పన్నులు మినహాయించటం వల్ల...ఉద్యోగాల కల్పన, సంక్షేమం పెద్ద ఎత్తున ఆగిపోతున్నది.
- భారత్‌లోని 'అసమానతల'పై ఆక్స్‌ఫామ్ రిపోర్టు
-- శ్రమ దోపిడీలో మహిళలు, చిన్నారులు
- ప్రభుత్వ విధానాలు మారాలి... లేదంటే ప్రజలు తిరగబడతారు : ఆక్స్‌ఫామ్
ఈదేశంలో పేదలు, మధ్యతరగతి, ముఖ్యంగా మహిళల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదు. వారి ప్రయోజనాలను ఫణంగా పెట్టి సంపన్నులు పైకి ఎగబాకుతున్నారు. దేశంలో 95 కోట్ల మంది (70 శాతం జనాభా) సంపదకు నాలుగురేట్లు....ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల వద్ద పోగైంది. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సీఈఓ 10 నిమిషాల్లో పొందుతున్న ఆదాయం...ఒక సాధారణ మహిళా కార్మికురాలి ఏడాది ఆదాయానికి సమానం. పేదలు-సంపన్నుల మధ్య అసమానతలు తొలగించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయటం లేదు. సంపన్నులపై పన్నులు మినహాయించటం వల్ల...ఉద్యోగాల కల్పన, సంక్షేమం పెద్ద ఎత్తున ఆగిపోతున్నది.
- భారత్‌లోని 'అసమానతల'పై ఆక్స్‌ఫామ్ రిపోర్టు
భారత్‌లో సంపద అసమానతలపై పాలకులు దృష్టిసారించకపోతే మున్ముందు ఊహించని పరిణామాలు ఉంటాయని ఆక్స్‌ఫామ్ హెచ్చరించింది. పేదరికం, అసమానతలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను సమీకరించడంలో ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులపై పన్నులను వడ్డించడంలో విఫలమవుతున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అసమానత లపై ప్రతిఏటా ఆక్స్‌ఫాం నివేదికలు విడుదలచేస్తుంది. పెరుగుతున్న అసమానతలు పెద్ద సవాల్‌గా మారుతున్నాయనీ, ఈమేరకు అనేక దేశాల్లో రాజకీయ, సామాజిక ఘటనలు చోటుచేసుకుంటు న్నాయనీ ఈసందర్భంగా నివేదిక తెలిపింది. అసమానతలు తగ్గించే విధానాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గణాంకాలు సూచిస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ వార్షిక సమావేశానికి ముందు 'టైమ్ టూ కేర్' పేరుతో ఆక్స్‌ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఐదురోజులపాటు జరిగే 'డబ్ల్యూఈఎఫ్' సమావేశాలు సోమవారం దోవోస్‌లో ప్రారంభమయ్యాయి.
ఒక్కశాతం సంపన్నుల చేతిలో 95కోట్లమంది సంపద
భారత్‌లో 63 మంది శతకోటీశ్వరుల సంపద 2018-19 కేంద్ర బడ్జెట్ (రూ 24.42 లక్షల కోట్లు) కంటే అధికమని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల సంపద...95.3 కోట్ల మంది (70 శాతం జనాభా) వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్లు అధికం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని ఆర్థిక అసమానతలు అనూహ్యంగా విస్తరించాయని నివేదిక తెలిపింది. పెరుగుతున్న జనాభా, అసమానతలు ఇదేవిధంగా ఉంటే ...2030నాటికి ప్రపంచంలో 230కోట్లమంది పేదరికంలోకి కూరుకుపోతారు.
ప్రతిఏటా పెరుగుతున్న శతకోటీశ్వరులు
ప్రపంచవ్యాప్తంగా 2,153 మంది శతకోటీశ్వరులు సంపద విశ్వవ్యాప్తంగా 60 శాతంగా ఉన్న 460 కోట్ల మంది వద్ద పోగుపడిన సంపద కంటే అధికం. ఈ దశాబ్ధంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరగడం ఆందోళనకరం. ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు సరైన విధానపరమైన చర్యలు అవసరమని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. కేవలం కొన్ని ప్రభుత్వాలే దీనికి కట్టుబడి ఉన్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు.
సరైన వేతనం లేదు..
సాధారణ ప్రజలు ముఖ్యంగా పేదలు, మహిళా కార్మికుల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని, వారి ప్రయోజనాలను పణంగా పెట్టి సంపన్నులు పైమెట్టుకు ఎగబాగుతున్నారని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. టెక్నాలజీ కంపెనీ సీఈవో తీసుకునే వార్షిక వేతనాన్ని ఇంటి పనులు చేసే మహిళా కార్మికురాలు అందుకోవాలంటే ఏకంగా 22,227 సంవత్సరాలు పడుతుందని నివేదిక అంచనా వేసింది.
భారత్‌లో శ్రమదోపిడి పెద్ద ఎత్తున ఉంది. దీనికి ఎక్కువగా మహిళలు, చిన్నారులు గురవుతున్నారు. ఒక రోజులో దేశవ్యాప్తంగా 326 కోట్ల పని గంటలకు మహిళలు, చిన్నారులు వేతనాన్ని అందుకోవటం లేదు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో రూ.19లక్షల కోట్లకు సమానం. 2019లో విద్యారంగానికి కేటాయించిన (రూ.93వేల కోట్లు) బడ్జెట్‌కు 20 రెట్లు ఉంటుంది.
పునాదులు కదిలే రోజు వస్తుంది !
ప్రస్తుతమున్న ఆర్థిక వ్యవస్థలో...సాధారణ ప్రజలు, మహిళలు ఖర్చు చేస్తున్నదంతా బడా వ్యాపారస్తుల, కోటీశ్వరుల జేబుల్లోకి వెళ్తున్నది. ఇదిలాగే కొనసాగితే...ప్రజలంతా తిరగబడే రోజు వస్తుంది. ప్రజలు ప్రశ్నించడం మొదలుపెడితే శత కోటీశ్వర్ల (బిలియనీర్ల) పునాదాలు కదులుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో మహిళలు, చిన్నారులకు దక్కుతున్నది చాలా స్వల్పం. గృహిణిగా మహిళ ఎన్నో గంటలపాటు శ్రమిస్తున్నది. వంటపని, ఇంటిపని, పిల్లల, పెద్దల సంరక్షణ...ఇవన్నీ చూస్తున్నారు. ఇందుకుగాను ఆమెకు ఎలాంటి వేతనం దక్కటం లేదు. సమాజం, ఆర్థిక వ్యవస్థలు ముందుకెళ్తున్నాయంటే వీటి వెనుక కనిపించని మహిళల శ్రమ దాగిఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి