24, ఏప్రిల్ 2019, బుధవారం

చేతులెత్తేసారా?...

- ఇంటర్‌లో అవకతవకలపై ప్రభుత్వానికి హైకోర్టు చురకలు
- యంత్రాంగం లేదని బాధ్యతల నుండి తప్పుకోవద్దు
- మీనమేషాలు లెక్కించకుండా తల్లిదండ్రుల కోణంలో ఆలోచించండి
- ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తే న్యాయం జరగదు
- లెక్కల్లో 60 మార్కులొచ్చిన విద్యార్థికి ఊరట లభిస్తుందా?
- సమస్య పరిష్కారంపై 29లోగా చెప్పాలని ఆదేశం
ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్లను సరిగ్గా వాల్యుయేషన్‌ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారించాలని కోరారు. దీనిని మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్య్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పిల్‌ను విచారించింది. మూడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష తప్పారు. వీరి సమస్యను ఎలా పరిష్కరిస్తారో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిలు 29న జరిగే విచారణ సమయంలో చెప్పాలి. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి