25, మే 2014, ఆదివారం

తెలుగుతేజం ప్రపంచ రికార్డు...


తెలుగు తేజం పూర్ణ ప్రపంచ రికార్డు సాధించింది. చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా పూర్ణ చరిత్ర సృష్టించింది. 
                రాష్ర్ట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు పూర్ణ, ఆనంద్ అతిపిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దానిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పదమూడేళ్ల పూర్ణ నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. పద్దెనిమిదేళ్ల ఆనందకుమార్‌ ఖమ్మం జిల్లా అన్నపురెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రపంచంలోనే అతి చిన్నవయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన బాలబాలికలుగా ఈ రోజు ( 25.05.2014 ) వీరు తిరుగులేని రికార్డును సృష్టించారు.

           వీరి ప్రతిభను గుర్తిం చిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీ వీరికి భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో ప్రత్యేక తర్ఫీదునిచ్చింది. వీరికి సొసైటీకి చైర్మన్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తనవంతు సహాయం అందించారు. మూడు నెలల తర్ఫీదు అనంతరం విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధం చేశారు.

పూర్ణ, ఆనంద్ లకు అభినందనలు.  

10, మే 2014, శనివారం

సంక్రాంతి పండుగ మా ఫోటోలు...




2014 సంక్రాంతి పండుగ సందర్బంగా  దిగిన కొన్ని ఫోటోలు - మా జ్ఞాపకాలు. 
మా అబ్బాయులు, వారి చెల్లెళ్లు.