22, సెప్టెంబర్ 2014, సోమవారం
2, సెప్టెంబర్ 2014, మంగళవారం
24 ఏళ్లకు టీమిండియా సిరీస్ కైవసం..
భారత్ - ఇంగ్లండ్ ల నాల్గవ వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ ఘనవిజయం సాధించింది. 30.3 ఓవర్లు పూర్తయ్యే సరికి 212 పరుగులు చేసి భారత్ ఆటగాళ్లు క్రీడాకారులను అబ్బురపరిచారు. భారత్ ఆటగాళ్లు రహనే -106, ధావన్-97 *, కోహ్లీ -1 పరుగులు చేసారు.
టెస్టుల్లో ఘోరంగా ఓడిన టీమిండియా.. వన్డే సిరీస్ లో విశేషంగా రాణించి ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఆటగాళ్లు సరికొత్త చరిత్రను లిఖించారు. గత రెండు వన్డేల్లో ప్రదర్శించిన ఊపునే కొనసాగించిన టీమిండియా ఆటగాళ్లు.. అదే విజయపరంపరను కొనసాగించి సిరీస్ 3-0 తేడాతో చేజిక్కించుకున్నారు.
ఇంగ్లండ్ 49.3 ఓవర్లు పూర్తయ్యే సరికి 206 పరుగులు పూర్తి చేసి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్ స్కోర్ వివరాలు: కుక్ -9, హెల్స్ -6, బల్లాన్స్-7, రూట్-44, మోర్గాన్ -32, బట్లర్-11, అలీ-67, వోక్స్-10, ఫిన్ -2, అండర్సన్-1, గర్నే -3 పరుగులు చేశారు.
భారత్ బౌలర్లు కుమార్ -2, షమీ -3, జడెజా -2,అశ్వీన్ , రైనా లు తలో వికెట్ తీసుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)